చిరంజీవి పవన్ కళ్యాణ్ ల రాజకీయ మార్గాలు వేరు అయినా గమ్యం ఒక్కటే  అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. దీనికితోడు ఈమధ్య పవన్ చిరంజీవిల మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయింది అన్న సంకేతాలు కూడ వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో నిన్న చిరంజీవి విడుదలచేసిన ఒక ప్రకటన ఏకంగా పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కు కూడ షాక్ ఇచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ ఇంగ్లీష్ మీడియం బోధన విషయంలో జగన్ ప్రభుత్యం అనుసరిస్తున్న విధానాల పై  తీవ్ర విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నాడు. 

నిన్న  కాకినాడ దగ్గర ఉన్న మండపేటలో పవన్ కళ్యాణ్ రైతు సమస్యల పై పవన్ కళ్యాణ్ ‘సౌభాగ్య దీక్ష’ చేసాడు. రైతుల సమస్యల పై తీవ్ర ఆవేశంతో మాట్లాడిన పవన్ రైతుల కోసం తాను ఎటువంటి పోరాటానికి అయినా సిద్ధం అంటూ సంకేతాలు ఇస్తూ జగన్ పై తీవ్ర విమర్శలు చేసాడు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే చిరంజీవి నిన్న ఒక ప్రకటన విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ప్రకటన ‘జనసేన వర్గాలకు కూడ ఇబ్బంది కరంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

నిన్న చిరంజీవి మహిళల భద్రతకు సంబంధించి జగన్ ప్రభుత్వం దిశా చట్టం చేయాలని నిర్ణయించడాన్ని చిరంజీవి హర్షిస్తు జగన్ పై ప్రశంసలు కురిపించాడు. దీనితో జగన్ ను హర్షిస్తూ చిరంజీవి ప్రకటన చేయడం అదేరోజు పవన్ జగన్ ను విమర్శిస్తూ పోరాట దీక్షలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఈ మెగా బ్రదర్స్ తీరు పై కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ చిరంజీవిలు వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న ఈ డబల్ గేమ్ ను చూసి తలలు పండిన రాజకీయ వేత్తలు కూడ ఆశ్చర్య పడుతున్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: