విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు దగ్గుబాటి ఫ్యామిలీ కి చెందిన సీనియర్ హీరో.. ఇటు అక్కినేని ఫ్యామిలీకి చెందిన‌ అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా కావడంతో ఈ సినిమాపై అటు సినిమా అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీమియంలు కంప్లీట్ కావడంతో వెంకీమామ టాక్‌ బయటకు వచ్చేసింది.

 

ప్రీమియర్ ల ప్రకారం చూస్తుంటే వెంకీ మామ సినిమా బిలో యావ‌రేజ్‌ అంటున్నారు. ఈ సినిమా కోసం సురేష్ బాబు ఏడాదికిపైగా దర్శకుడు బాబీని పదే పదే తన చుట్టూ తిప్పుకున్నారు. ఇక సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక కూడా నాలుగు నెలల వరకు ఆయన త‌న సినిమా రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేశారు. తన బ్యానర్ లో వచ్చే సినిమాల విషయంలో సురేష్ బాబు ఎప్పుడు నాన్చి నాన్చి కాని క‌థ‌ను ఓకే చేయ‌రు.

 

ఇప్పుడు వెంకీ మామ విష‌యంలోనూ అలాగే అనిపిస్తుంది. ఓవరాల్ గా రెండు సంవత్సరాల పాటు సురేష్ బాబు దగ్గర నలిగి నలిగి ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అవుట్ ఫుట్‌ ప్రేక్షకులకు అంతగా రుచించ లేదనే చెప్పాలి. ఎప్పుడో 1980వ దశకంలో ఉన్న కథను తీసుకుని దానికి పరమ రొటీన్ ట్రీట్మెంట్ తో ఈ సినిమా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి సినిమాకా సురేష్ బాబు రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నది అన్న చర్చలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

ఫైనల్ గా ఒక సినిమాను ఒప్పుకునే ముందు సురేష్ బాబు రోజుల తరబడి నాన్చడం చివరకు సరైన కథను ఎంపిక చేసుకోలేకపోవడం... రిలీజ్ డేట్ విషయంలో ఆలస్యం చేయడంతో ఆయన బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు అంతగా సక్సెస్ అవ్వలేదు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వెంకీ మామ విష‌యంలోనూ అదే నిజ‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: