విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ, నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలోనే ఈ సినిమా ప్రీమియర్ షో లను అమెరికా, యూఏఈ దేశాల్లో ప్రదర్శించడం జరిగింది. తొలిసారిగా వెంకటేష్ నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాకు ఓవర్ అల్ గా మిశ్రమ స్పందన లభించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అయితే దర్శకుడు బాబీ ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా తీసినప్పటికీ, 

 

సెకండ్ హాఫ్ పై మాత్రం అంతగా కేర్ తీసుకోలేదని అంటున్నారు. కాగా ఓవర్ ఆల్ గా సినిమా బాగానే ఉందని, చాలా ఏళ్ళ తరువాత వెంకటేష్ ని మంచి రోల్ లో చూశామని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన పవర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు బేబీ తీసిన ఈ సినిమాలో వెంకీ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా, చైతన్య సరసన రాశి ఖన్నా నటించింది. ఇక ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 

 

ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా వెంకీ మరియు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ల మధ్య వచ్చే ఓల్డ్ స్టైల్ రిట్రో సాంగ్ కు వెంకటేష్ ఫ్యాన్స్, హాల్ లో ఈలలు గోలలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. యువ సింగర్ పృథ్వి చంద్ర పాడిన ఈ పాటకు శ్రీమణి అందించిన లిరిక్స్, అలానే థమన్ అందించిన బ్యూటిఫుల్ ట్యూన్ మరింత అందాన్ని తెచ్చాయి. ఇప్పటికే లిరికల్ గా కూడా మంచి స్పందన సంపాదించిన ఈ సాంగ్ లో వెంకీ, ఓల్డ్ స్టైల్ సూట్ లు వేసి మరొక్కసారి స్క్రీన్ పై తన ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు అనే చెప్పాలి . మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేర కలెక్షన్స్ తో ముందుకు నడుస్తుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: