విక్టరీ వెంకటేష్ ఇటీవల వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాని తరువాత ప్రస్తుతం తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ సినిమాలో నటించారు వెంకటేష్. ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కొంత మిశ్రమ స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. మామ, అల్లుళ్ళ మధ్య పెనవేసుకున్న అనురాగం, 

 

అనుబంధం నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ఎమోషన్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ని కలగలిపి దర్శకుడు బాబీ ఈ సినిమా తెరకెక్కించారట. ఇక సినిమా చూసిన మెజారిటీ ప్రేక్షకులు సినిమా బాగానే ఉందని, అయితే ఫస్ట్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ పై దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టినట్లయితే హిట్ అయి ఉండేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్, చైతన్య మరియు హీరోయిన్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయని, దానితో ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ లేకుండా హ్యాపీగా సాగిపోతుందట. అయితే మంచి జోష్ తో ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒక అరగంట తరువాత సినిమా కొంత చప్పబడుతుందని, అలానే ప్రీ క్లైమాక్స్ వరకు సాదా సీదాగా సాగుతూ, చివరిలో ఊపందుకుంటుందని చెప్తున్నారు. 

 

ఇక సాంగ్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్, ఎంటర్టైన్మెంట్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి సినిమాలో అదిరిపోయాయని అంటున్నారు. తొలిసారిగా నటించినప్పటికీ, మామ అల్లుళ్లయిన వెంకీ, చైతు కలిసి నటించిన ఈ సినిమా ఎప్పటికీ అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ మనస్సుల్లో నిలిచిపోవడం ఖాయం అని అంటున్నారు. ఎమోషనల్ సీన్స్ చేయడంలో వెంకటేష్ మరొక్కసారి తన గత సినిమాలను గుర్తుచేశారట. మొత్తంగా మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిరాశపరచదని, అలానే ప్రస్తుతం మరొక వారం వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం వెంకీ మామకు కలిసి వచ్చే అంశమని అంటున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: