నిజ జీవితంలో స‌క్సెస్ సాధించ‌డం, పేరు సంపాదించ‌డం కంటే వాటిని నిల‌బెట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చాలా మందికి తెలుసు. ఈ మాట మ‌రీ సినీ రంగంలో చాలా క‌ష్ట‌మ‌వుతుంది. అందుకు ఉదాహరణ పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఎందుకంటే పోయినేడాది ఆరెక్స్ 100 లాంటి సెన్సేష‌న‌ల్ మూవీతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన పాయ‌ల్ ఆ చిత్రంతో ఎంత పేరు సంపాదించుకుందో  సినిమా ఎంత పెద్ద హిట్ట‌యిందో తెలిసిందే.

 

 

ఈ గుర్తింపుతో పాయ‌ల్‌ను ఓ మోస్త‌రుగానే అవ‌కాశాలు ప‌ల‌క‌రించాయి. కానీ వాటిలోంచి ఏవి ఎంచుకోవాల‌నే తెలివి పాయ‌ల్‌కు లేక‌పోయింది. సీత‌లో ఐటెం సాంగ్ చేస్తే దాని వ‌ల్ల ఫ‌లితం లేక‌పోయింది.. ఆ తర్వాత ఆర్డీఎక్స్ ల‌వ్ అనే సినిమా చేస్తే దాని వ‌ల్ల చాలా పెద్ద న‌ష్ట‌మే జ‌రిగింది. మ‌రీ వ‌ల్గ‌ర్‌గా ఉన్న ఆ సినిమా వ‌ల్ల పాయ‌ల్‌కు చాలా చెడ్డ పేరు వ‌చ్చింది. అది ఏ స్థాయిలో అంటే కాస్త పేరున్న‌, ఫ్యామిలీ సినిమాలో పాయ‌ల్‌ను పెట్టుకోవాలంటే భ‌య‌ప‌డేంత‌? ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కావ‌డానికి ముందే పాయ‌ల్‌కు వెంకీ మామ అనే పెద్ద సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి బ‌డా హీరో స‌ర‌స‌న న‌టించే ఛాన్సొచ్చింది.

 

 

కానీ ఆర్డీఎక్స్ ల‌వ్ ద్వారా పాయ‌ల్‌కు వ‌చ్చిన బ్యాడ్ ఇమేజ్ త‌మ సినిమాకు చేటు చేస్తుంద‌నో ఏమో.. ఈ సినిమా ప్రోమోల్లో ఎక్క‌డా ఆమె హైలైట్ కాకుండా, అస‌లు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త పడ్డారు చిత్రబృందం. ఇక ఎట్టకేలకు ఈ రోజు అంటే డిసెంబర్ 13 న విడుదల అయినా ఈ చిత్రం  ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, యూఎస్‌లో ఇప్పటికే ‘వెంకీమామ’ ప్రివ్యూ షోలు ప్రారంభమై పోయాయి.

 

 

అక్కడ నుంచి రివ్యూలు అందించే సినీ విమర్శకులు మాత్రం సినిమాపై పెదవి విరుస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. కామెడీ, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయని, వెంకటేష్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు. అయితే.. హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉంటే ఏంది . పాయల్ చెప్పుకోవడానికి కనీసం ఈ పెద్ద సినిమా అయినా దొరికిందంటున్నారు అభిమానులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: