తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్ సినిమాలు రావటం అరుదుగా జరుగుతోంది. సీనియర్ హీరో వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ ఈ జ‌న‌రేష‌న్ హీరోల‌కు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే నిజ జీవితంలో తనకు అల్లుడు అయిన‌ అక్కినేని హీరో అక్కినేని నాగచైతన్య తో కలిసి నటించిన మల్టీ స్టారర్ వెంకీ మామ. కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్... చైతుకు జోడీగా రాశీ ఖ‌న్నా నటించారు. కొద్ది రోజులుగా రీలీజ్ కోసం స‌రైన డేట్ లేక వెయిట్ చేస్తోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి దిగింది.

 

ఇక ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు వినిపిస్తోంది. కామెడీ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయిందని... వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు అని అంటున్నారు. ఇక మామ‌, అల్లుళ్ల‌లో ఎవ‌రు డామినేట్ చేశార‌న్న‌దానిపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని ..ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అదిరిపోయిందని చెపుతున్నారు. మామా అల్లుళ్లలో వెంకటేష్‌దే పైచేయి అని అంటున్నారు. కథలో వెంకటేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందట. దానికి తగ్గట్టే వెంకీ వన్ మ్యాన్ షోతో ఇరగదీశాడ‌ని చెపుతున్నారు.

 

అయితే నాగ‌చైత‌న్య కే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ద‌క్కిందంటున్నారు. అయితే వెంకీ సీన్లే ఎక్కువుగా పేలాయంటున్నారు. వెంకీ త‌న సీనియార్టీ చూపించాడ‌ని.. కామెడీ, డైలాగ్ టైమింగ్ అదుర్స్ అంటున్నారు. నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని ..ఆర్మీ సీన్లలో చైతన్య యాక్టింగ్ సూపర్ అంటున్నారు. హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ద‌ర్శ‌కుడు బాబి త‌న గ‌త సినిమాల్లాగా నే క‌థ‌ను న‌డిపించ‌డంలో మ‌రోసారి త‌డ‌బ‌డ్డా డ‌ని ప్రేక్ష‌కులు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: