ఒకవైపు పవన్ రెచ్చిపోయిన ఆవేశంతో నిన్న మండపేటలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ లో పాల్గొంటూ జగన్ ను ఘాటైన వ్యాఖ్యలతో టార్గెట్ చేస్తూ వాతావరణాన్ని వేడెక్కించాడు. అయితే ఈ రాజకీయ వేడి మధ్య ఆదీక్షా శిబిరంలో ఉన్న పవన్ అభిమానులకు ‘పింక్’ రీమేక్ కు సంబంధించిన పూజా కార్యక్రమాల వార్తలు లీక్ అవ్వడంతో జనసైనికులతో పాటు పవన్ వీరాభిమానులు కూడ జోష్ లోకి వెళ్ళిపోయారు.

నిన్న హైదరాబాద్ లో ‘పింక్’ రీమేక్ కు సంబంధించి దిల్ రాజ్ ప్రత్యేకంగా తీసుకున్న ఒక భవంతిలో ‘పింక్’ రీమేక్ పూజా కార్యక్రమాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈకార్యక్రమాలకు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను కానీ అదేవిధంగా మీడియా వర్గాలను కానీ ఆహ్వానించకుండా చాల రహస్యంగా ఈ కార్యక్రమాన్ని ముగించినట్లు టాక్. 

దీనితో ఇప్పటి వరకు వార్తలలో వస్తున్న ప్రకారం పవన్ ‘పింక్’ రీమేక్ లో నటించే విషయం ఖరార్ అయింది. అయితే ‘పింక్’ ఒరిజనల్ మూవీలో తాప్సీ నటించిన పాత్రకు ఎవర్ని ఎంపిక చేయాలి అన్న విషయమై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్.  సమంతతో పాటు మళయాళ బ్యూటీ నివేద థామస్ అంజలి పేర్లు పరిశీలనలో ఉన్నా దిల్ రాజ్ దృష్టి మాత్రం సమంత పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే పవన్ కళ్యాణ్ మూడ్ కు తగ్గట్టుగా డేట్స్ ఇవ్వడం సమంత వల్ల కాదు కాబట్టి ఎదో విధంగా ‘పింక్’ ఒరిజినల్ మూవీలో నటించిన తాప్సీని ఈ రీమేక్ కోసం రంగంలోకి దింపాలని దిల్ రాజ్ ఆమెతో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈమ్యూజికల్ చైర్ లో పవన్ పక్కన ‘పింక్’ రీమేక్ లో నటించే హీరోయిన్ ఎవరు అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. దీనికితోడు జనవరి ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో దిల్ రాజ్ ఎంత ఒత్తిడి చేసినా పవన్ రాజకీయ వేడిని తగ్గించడం సాధ్యం అవుతుందా అన్న సందేహాలు కూడ అందరిలో ఉన్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: