విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లు అన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలసి సినిమాలో నటిస్తే చూడాలని చాల మంది అభిమానులు కోరుకున్నారు. వారు కోరుకున్నట్లే ప్రేక్షకుల ముందుకు అదే బంధంతో  మామా అల్లుళ్లుగా వచ్చారు. ఆ సినిమాపేరే ‘వెంకీమామ’.. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఇటు దగ్గుబాటి అభిమానులతో పాటు అటు అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసారు. వారి చూపులకు బ్రేక్ వేస్తూ మొత్తానికి భారీ అంచనాల నడుమ, వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం శుక్రవారం 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

 

ఇకపోతే ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వెంకటేష్ చేసిన మరో మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు విపరీతమైన ప్రచారం కల్పించారు చిత్ర బృందం. తనకు ఇది మరో ‘మనం’ అంటూ నాగచైతన్య కూడా చెప్పారు. ఇదిలా ఉండగా 'వెంకీ మామ' టైటిల్‌లో నాగచైతన్య ప్రస్తావన లేదు. ట్రెయిలర్‌ చూసినా కానీ వెంకటేష్‌ హైలైట్‌ అవుతూ, చైతన్య సైడ్‌కి కనిపిస్తున్నాడు. మల్టీస్టారర్‌ అయిన ఈ చిత్రంలో వెంకటేష్‌ ఎక్కువగా ఫోకస్ ఎందుకు అయ్యాడనేది అక్కినేని అభిమానులకి అర్థం కావట్లేదట.

 

 

అయితే ఈ విషయం పై నాగచైతన్య క్లారిటీ ఇచ్చేసాడట. అదేమంటే ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌ అనడం సబబు కాదని ఈ చిత్రంలో తాను ఒక పాత్ర చేసానని, హీరో 'వెంకీ మామ' అని చైతన్య అంటున్నాడు. గతంలో 'మనం' చిత్రంలోను నాగచైతన్య తన తండ్రికి సపోర్టింగ్‌ రోల్‌ మాత్రమే చేసాడు. తాను కూడా సక్సెస్‌ఫుల్‌ హీరో కనుక తనకి పెద్ద పాత్ర వుండాలని నాగచైతన్య ఎప్పుడూ కూడా డిమాండ్‌ చేయడనేది టాక్...

 

 

అయితే నిజానికి వెంకీ మామ కథ అనుకున్నపుడు నాగచైతన్య పాత్ర ఇంకా చిన్నదట. కానీ చైతన్య ఈ చిత్రం చేయడానికి అంగీకరించగానే వెంకటేష్‌ స్వయంగా బాబీకి చెప్పి చైతన్య పాత్రని పెంచమని అన్నాడట. అలా నాగచైతన్య పాత్రని సైనికుడిగా చూపించి, సర్జికల్‌ స్ట్రయిక్‌లో పాల్గొనడం లాంటి సన్నివేశాలని బాబీ జోడించాడట. అయినప్పటికీ ఇందులో తాను హీరోని మాత్రం కాదనే చైతన్య అంటున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: