డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” సినిమా డిసెంబర్ 12 వ తారీఖున రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న టెన్షన్ తో సినిమా రిలీజ్ కాగా విడుదలైన మొట్ట మొదటి షోకే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. సినిమాలో పాత్రలు ఆంధ్ర రాజకీయ నాయకులను తలపించే విధంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ పోలిన పాత్ర మరియు నారా లోకేష్ పోలిన పాత్ర రెండు పాత్రలు సినిమాకి హైలెట్ అని ఆ రెండు క్యారెక్టర్లతో సినిమాకి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించారని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

 

ముఖ్యంగా సినిమా మొత్తానికి ఏపీ సీఎం జగన్ ని పోలిన పాత్ర జగన్నాథరెడ్డి క్యారెక్టర్ చాలా హైలెట్ గా డైరెక్టర్ ఆర్జివి తెరకెక్కించడం జరిగిందని సినిమా చూసిన జగన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయం లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” సినిమా చర్చనీయాంశమైంది. ఆంధ్ర ప్రదేశ్ 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న సంఘటనలు మరియు అసెంబ్లీ సమావేశాలలో చోటు చేసుకున్న సంఘటనలు కళ్ళకి కట్టినట్లుగా “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” సినిమా ఉండటంతో ఈ సినిమా చూడటానికి అధికార పార్టీ వైసీపీ నేతలు రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

 

ఇదే క్రమంలో సీఎం జగన్ కూడా సినిమాను చూడాలని అందరం కలిసి వెళ్లాలని పార్టీ నేతలతో అన్నట్లు... దీని కోసం స్పెషల్ షో వైసీపీ పార్టీ అధికారం నేతలందరికీ వేయించే ఉద్దేశంలో “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: