ఎన్నో ఏళ్ల నుండి అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వెంకటేష్, చైతన్య కాంబినేషన్ ఎట్టకేలకు వెంకీ మామ రూపంలో తీరింది. నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించేలా టాక్ ని సంపాదించింది. ముఖ్యంగా దర్శకుడు బాబీ, సినిమా యొక్క ఫస్ట్ హాఫ్ ని బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించి, సెకండ్ హాఫ్ ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక సినిమాలో వెంకటేష్, చైతన్యల మధ్య వచ్చే కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని, 

 

అలానే సాంగ్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్ గా మాత్రం ఈ సినిమా ఎంతో బాగుందనేది ప్రేక్షకులు చెప్తున్న మాట. సినిమా కథ, కథనాల విషయమై దర్శకుడు మరింతగా శ్రద్ధ కనబరిచినట్లైతే, తప్పకుండా సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉండేదని, అయితే ఓవర్ ఆల్ గా చెప్పాలంటే, దీనిని యావరేజ్ మూవీ గా చెప్పుకోవచ్చని అంటున్నారు. తన తొలి సినిమా పవర్ నుండి దర్శకుడు బాబీ అదే తప్పు చేస్తూ, ఇందులో కూడా సెకండ్ హాఫ్ ని పెద్దగా తీయలేదని వారు అంటున్నారు. వెంకటేష్ ఆకట్టుకునే నటన సినిమాకు ప్రధాన బలం అని, ఇక నాగ చైతన్య కూడా బాగానే నటించినప్పటికీ, 

 

అతడు సెంటిమెంట్ సీన్స్ లో ఎమోషన్స్ పెద్దగా పండించలేకపోయాడని అంటున్న వారు కూడా ఉన్నారు. ఒకరకంగా ఈ సినిమాని చూస్తుంటే, గతంలో చైతన్య లాంచింగ్ మూవీ అయిన జోష్ తమకు గుర్తుకువ వస్తోందని వారు అంటున్నారు. సెంటిమెంట్స్, ఎమోషన్స్ ని ఇష్టపడే ఆడవారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ సినిమాకు తప్పకుండా  ఉంటుందని, అదీకాక మరొక వారం వరకు ఈ సినిమాకు పోటీ లేకపోవడంతో తప్పకుండా మంచి కలెక్షన్స్ సాదిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి వారు ఆశిస్తున్నట్టు ఈ సినిమా మున్ముందు ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: