ప్రస్తుతం వెంకటేష్ మరియు నాగచైతన్యల కాంబినేషన్లో వచ్చిన వెంకీ మామ సినిమా థియేటర్స్ నుండి ఒకింత మిశ్రమ స్పందనను రాబడుతోంది. వెంకటేష్ ఒక పల్లెటూరి రైతుగా, అలానే నాగ చైతన్య  సోల్జర్ గా కనపడిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా రాశి కన్నా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించారు. యువ సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించగా, సురేష్ ప్రొడక్షన్స్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

 

ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకులు చెప్తున్న మాట ఏంటంటే, సినిమా ఓవర్ ఆల్ గా ఓకె అనే, అయితే తాము ఊహించినంత రేంజ్ లో మాత్రం సినిమా లేదని అంటున్నారు. మొదటి అర్ధభాగంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, వంటి సరదా సన్నివేశాలు ఎక్కువ ఉండడంతో పాటు ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా సాగుతుందట, అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా చోట్ల ల్యాగ్స్ ఉన్నాయని, ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్దను దర్శకుడు మరింతగా సెకండ్ హాఫ్ పై కూడా పెట్టి ఉంటె సినిమా మరొక రేంజ్ లో ఉండేదని చెప్తున్నారు. 

 

ఇక వెంకటేష్ ఈ సినిమాలో అత్యద్భుతమైన నటనను కనబరిచారని, మంచి కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆయన పండించిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం అక్కినేని నాగార్జున మరియు ఆయన మేనల్లుడు సుమంత్ ల కాంబినేషన్లో వచ్చిన స్నేహమంటే ఇదేరా సినిమా మాదిరిగా ఈ సినిమా ఫ్లాప్ మాత్రం కాదని, తప్పకుండా సినిమా రాబోయే రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత కనెక్ట్ చేస్తుందని కొందరు ప్రేక్షకులు చెప్తున్నారు. ఇకపోతే సినిమా యూనిట్ కూడా మంచి టాక్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. మరి మున్ముందు ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబడుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: