విక్టరీ వెంకటేష్ మరియు ఆయన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యల తొలి కలయికలో తెరకెక్కిన వెంకీ మామ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై డి సురేష్ బాబు, టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను మంచి ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్ ని కలగలిపి దర్శకుడు బాబీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేయడం జరిగింది. 

 

అయితే ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఊహించిన రేంజ్ లో అయితే సినిమా లేదని, కాకపోతే యావరేజ్ సినిమాగా వెంకీ మామ నిలిచే అవకాశం ఉందని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక ఈ సినిమా తొలి షో నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో వెంకీ తన అత్యద్భుతమైన నటనతో మరొక్కసారి ప్రేక్షకుల మనసు దోచారని, అలానే ఆయన ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతో కన్నులపండుగగా ఉంటుందని అంటున్నారు. ఇకపోతే ఆయన మేనల్లుడు నాగచైతన్య కూడా బాగానే నటించినప్పటికీ, మామ వెంకటేష్ రేంజ్ లో మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయాడని అంటున్నారు.  

 

కామెడీ,మరియు ఎంటర్టైన్మెంట్స్ సీన్స్ లో అదరగొట్టిన చైతు, ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అంతబాగా ఆకట్టుకోలేదని, కావున అతడు నటనలో మరింత పరిణితి చెందవలసి ఉందనేది కొందరు ప్రేక్షకుల వాదన. ఇక హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తో పాటు సినిమాలోని మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంతో బాగున్నాయని, ఓవర్ ఆల్ గా ఆడియన్స్ ని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఈ సినిమాతో, ఎన్నో ఏళ్ల నుండి వెంకీ, చైతు కలిసి నటించాలి అనే తమ కల నెరవేరిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: