అల్లుడు నాగచైతన్య మామ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు సినిమాల్లో కూడా మామ అల్లుళ్ళుగా వెంకీ మామ సినిమాలో నటించారు. వెంకీ మామ సినిమాను  దర్శకుడు బాబీ  తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్... నాగచైతన్య సరసన రాసి కన్నా నటించారు.నేడు  విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా నేడు వెంకీ మామ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  నెలకొనగా... ప్రేక్షకుల అంచనాలను అందుకుంటు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది వెంకీ మామ సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.టాక్  చూస్తుంటే వెంకీ మామ సినిమా  అటు వెంకటేష్ ఇటు  నాగచైతన్య ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమని తెలుస్తోంది. 

 

 

 

 కాగా ఈ సినిమాలో వెంకటేష్ యాక్టింగ్  ముందు నాగచైతన్య తేలిపోయాడు. వెంకీ మామ సినిమా తో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు వెంకీ మామ కేరాఫ్ అడ్రస్ అని మరోసారి నిరూపించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ... సెంటిమెంట్ ఎలిమెంట్స్ అన్నీ బాగా పండించి  సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ కన్నీళ్లు కూడా పెట్టించేస్తున్నాడు . కాగా వెంకీ మామ సినిమాలో వెంకటేష్ నాగచైతన్యను డామినేట్ చేస్తూ వన్ మ్యాన్ షోగా  సినిమాను నడిపించాడు. కాగా వెంకీమామ సినిమాలో  విక్టరీ వెంకటేష్ గెటప్ తమిళ హీరో అజిత తలపిస్తోంది. అంతేకాకుండా గత కొంతకాలంగా వెంకటేష్ సోలో హీరో సినిమాలకు దూరమైపోయారు. 

 

 

 తెలుగు సినిమాలు వెంకటేష్ సోలో హీరోగా సినిమాలు కొన్నేళ్లు అయిపోతుంది. మొన్నటికి మొన్న సంక్రాంతికి ఎఫ్2 తో మెగా హీరో వరుణ్ తేజ్ తో మల్టీస్టారర్ సినిమాలో  నటించారు వెంకటేష్. ఇక ఇప్పుడు మరో మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగచైతన్య తో కలిసి నటించిన వెంకీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే మల్టీస్టారర్ సినిమాలో వెంకటేష్ బాగానే ఎంటర్టైన్  చేస్తున్నప్పటికీ వెంకటేష్ సోలో సినిమాలో నటిస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఓవైపు యువ హీరోలతో నటిస్తూ మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే మరోవైపు సోలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: