అక్కినేని వారసునిగా సినీరంగ ప్రవేశం చేసిన నాగచైతన్య అభిమానులు కోరుకున్నట్లుగా పెద్ద మాస్ హీరో కాలేకపోయాాడు కానీ..  కెరీర్ ఆరంభంలోనే మంచి పెర్ఫామర్‌గా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘మజిలీ’ సినిమాతో నటుడిగా అతను మరి కొన్ని మెట్లు పైకెక్కాడు.

 

 

ఇప్పుడిక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాతో అతను కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వ బోతున్నాడన్నది చిత్ర వర్గాల సమాచారం. ఇకపోతే ఇప్పుడు వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం వెంకీమామ. ఇక వెంకటేష్, నాగచైతన్య రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లు అన్న సంగతి అందరికి తెలిసిందే.. తెరపైన కూడా మొట్ట మొదటిసారిగా అదే రిలేషన్ కంటిన్యూ చేస్తూ వీరిద్దరు కలిసి నటించిన చిత్రం వెంకీమామ..

 

 

ఈ రోజు అనగా శుక్రవారం 13వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాను అంచనాలకు తగ్గట్టు గానే విపరీతమైన ప్రచారం కల్పించి విడుదల చేశారు.. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఫస్టాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అదిరిపోయిందట.

 

 

మామా అల్లుళ్లలో వెంకటేష్‌దే పైచేయి అని అంటున్నారు. కథలో వెంకటేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందట. దానికి తగ్గట్టే వెంకీ వన్ మ్యాన్ షోతో ఇరగదీశారని ట్వీట్లు చేస్తున్నారు. నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఆర్మీ సీన్లలో చైతన్య యాక్టింగ్ సూపర్ అంటున్నారు.

 

 

అలాగే, ఎమోషన్స్‌లో కొత్త వేరియేషన్స్ చూపించారని ఫస్టాఫ్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగిందని.. మిక్స్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయంటున్నారు. ఓవరాల్‌గా వెంకీమామ నభూతో నభవిష్యతి అన్నమాదిరిగా ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు వెంకటేష్, నాగచైతన్య అభిమానులు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: