మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  మొదట్లో కాస్త ఇబ్బందులు పడ్డా..తమ్ముడు, బద్రి, తొలిప్రేమ, సుస్వాగతం లాంటి మూవీస్ తో మంచి స్టార్ హీరోగా ఎదిగారు.  సక్సెస్, ఫెయిల్యూర్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా తన కెరీర్ కొనసాగిస్తున్న పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ మూవీ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న పవన్ కళ్యాన్ కి రాజకీయ వేధికే సరైన మార్గమని తలచి ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు. ఇప్పటికీ పార్టీ స్థాపించి ఆరేళ్లు అయ్యింది.. అయితే పార్టీ స్థాపించినపుడు ఆయన పోటీ చేయలేదు.  ఇటీవల ఏపిలో ఎన్నికల్లో పోటీ చేసినా ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  స్వయంగా జనసేన అధినేతగా ఆయన పోటీ చేసిన స్థానాలు కూడా ఓడిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ శ్రీనివాస్ తో ‘అజ్ఞాతవాసి’ మూవీ చివరిగా నటించారు.  

 

మూవీ అంచనాలు తారుమారు చేసి భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. కేవలం 20రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా వుండే కథను ను ఎంచుకున్నారు. ఎట్టకేలకు పవన్ రీ ఎంట్రీ పై క్లారిటీ దొరికింది.  బాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీని తెలుగు లో రిమేక్ చేసేందుకు సిద్దమవుతున్నారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ హిందీ హిట్ మూవీ రీమేక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

బోనికపూర్ దిల్ రాజు నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలో పింక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ నేడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని కలవడంతో పాటు పింక్ రీమేక్ కొరకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాము అని అధికారికంగా ప్రకటించారు.   థమన్ కూడా నా మొదటి బిగ్ ప్రాజెక్ట్ హీరో గారితో అని ట్వీట్ చేశారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ని వెండి తెరపై చూడలని ఆశపడుతున్న అభిమానులకు ఇది పండుగలాంటి వార్త అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: