మొత్తానికి నాలుగు నెల‌లుగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న వెంకీ మామ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. చాలా రోజుల తర్వాత మామ – మేనల్లుడు బ్యాక్ డ్రాప్ సినిమా. అది కూడా రియల్ లైఫ్ మామ అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్య లు కలిసి చేస్తున్నారు అనే హైప్ తో వచ్చిన వెంకీ మామ సినిమాను ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడాల‌న్న ఆతృత తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌లిగింది.

 

తీరా ఫ‌స్ట్ షో చూసాక ప్రేక్షకులకి కలిగే ఫస్ట్ ఫీలింగ్.. ఈ కాంబినేషన్ లో సినిమా అని వినగానే వచ్చిన ఫీల్ లో సగం కూడా రెండున్నర గంటల సినిమా చూసాక రాలేదేందబ్బా అని షాక్ లో ఉంటారు. కాంబినేషన్లో క్రేజ్ తప్ప – కంటెంట్ లో సత్తాలేక పోతే తెలుగు సినిమా ప్రేక్ష‌కుడు ఎంత గ‌ట్టి దెబ్బ కొడ‌తాడో ? గ‌తంలో ఎన్నో సినిమాల రిజ‌ల్ట్స్ చూశాం. ఇక ఇప్పుడు ఈ సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది.

 

ఇక ఫ‌స్టాఫ్‌లో అక్కడక్కడా పరవాలేధనిపించినా, వరస్ట్ సెకండాఫ్ తో బోరింగ్ తో పాటు చిరాకు కూడా తెప్పించేలా చేయడం మనీ పెట్టిన ప్రేక్షకుడికి వెంకీ మామ ఇచ్చే స్పెషల్ బోనస్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే 59 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా మామ వెంకటేష్‌లో ఉన్న గ్రేస్ అల్లుడు నాగ‌చైత‌న్య‌లో ఎంత మాత్రం లేద‌ని కూడా అంటున్నారు.

 

విచిత్రం ఏంటంటే సినిమా అంతా నాగ‌చైత‌న్య‌కే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్సీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని వెంకీ కూడా సినిమా రిలీజ్‌కు ముందే చెప్పారు. త‌న రోల్ త‌గ్గించి.. చైతు రోల్ పెంచ‌మ‌న్నాన‌ని చెప్పాడు. అయితే సినిమా చూశాక చైతు ఎంత సేపు ఉన్నా.. వెంకీ రోల్ తెర‌పై చాలా త‌క్కువ సేపే ఉన్నా వెంకీ న‌ట‌న‌కు ,ఆ పాత్ర‌కే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. వెంకీ చేసిన సీన్లు అన్ని పేలితే .. చైతు సీన్లు చాలా చోట్ల తేలిపోయాయి. మ‌రి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్ల‌వుతున్నా చైతు ఇంకెప్పుడు న‌ట‌న‌తో మార్కులు కొడ‌తాడో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: