సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా వెంకీ మామ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్కన రాశి ఖన్నా కథానాయకలాగా నటించారు. 

                   

వెంకీ మామ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అయితే దర్శకుడు బాబీ ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా తీసినప్పటికీ, సెకండ్ హాఫ్ పై మాత్రం కేర్ తీసుకోలేదని అంటున్నారు. అయితే ఓవర్ ఆల్ గా సినిమా అంత చూస్తే బాగానే ఉందని, చాలా ఏళ్ళ తరువాత వెంకటేష్ ని మంచి రోల్ లో చూశామని కొందరు ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

                                 

అయితే సినిమా ఎంత ఉన్న.. ఎంత మల్టీస్టార్ చిత్రం అయినా దృశ్యం సినిమా కంటే మించలేదు అని అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే సినిమాలో సీన్స్ అన్ని బాగున్నాయి అని టాక్ వచ్చింది. అయితే సినిమాలో సీన్స్ అన్ని బాగున్నప్పటికీ సినిమా అంత చూస్తే.. గతంలో వెంకీ తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ దృశ్యం సినిమా ఏ అద్భుతంగా ఉంటుంది అని నెటిజన్లు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎన్నో రోజుల తర్వాత మల్టీస్టార్ తో వచ్చిన ఈ సినిమాను వెంటనే చూసేయండి. ముందే ఫ్యామిలీ ఎంటర్టైనర్.. మరో వారం వరుకు ఇంకో సినిమా రాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: