'అయ్యో అయ్యో అయ్యయ్యో' అంటూ మనల్ని నవ్వించినా, ఎనీ టైం ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేష్ అంటూ ఎమోషన్ పండించినా అది వెంకీ కే సాధ్యం. హీరోలు అంటే గంభీరంగా ఉండాలనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మనల్ని కామెడీ తో నవ్వించిన ఘనత వెంకీ కే చెందుతుంది. విక్టరీ ని తన ఇంటి పేరుగా మార్చుకుని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథాంశాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. 

 

కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేసిన వెంకటేష్ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. సాధారణంగా నిర్మాతల కుమారులు అప్పట్లో సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు వెంకటేష్ సినిమా రంగంలో ప్రవేశించి కొత్త వరవడి సృష్టించారు. వరుస సినిమాలతో విజయదుందుభి మోగించారు. 

 

వెంకటేష్ కు నల్ల చొక్కా ఒక సెంటిమెంట్ నల్ల చొక్కా లేకుండా వెంకీ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగే వెంకటేష్ కు 'రా' సెంటిమెంట్ కూడా ఉంది కలిసుందాం రా, ప్రేమతో రా, ప్రేమించుకుందాం రా అంటూ వరుసగా రా తో ముగిసే సినిమాలు తీసి విజయం సాధించారు.

 

ఇక వయసు మళ్ళిన తరువాత తన హీరోయిజం పక్కన పెట్టి సాధారణ సినిమాలు చేశారు అందుకు ఉదాహరణ దృశ్యం సినిమా. ఈ సినిమాలో వెంకీ ఇద్దరు పిల్లల తండ్రి గా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇక తాజాగా తన మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ సినిమా ను చేశారు. ఈరోజు వెంకీ బర్త్ డే సందర్బంగా వెంకీ మామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమాలో వెంకీకి జతగా పాయల్ రాజపుత్ నటించారు ఇక నాగ చైతన్యకు జతగా రాశీ ఖన్నా నటించారు. వెంకీ బర్త్ డే సందర్బంగా విడుదలైన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: