పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటించిన అజ్ఞాతవాసి ,రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  సాహుకు కొన్ని పోలికలు వున్నాయి.  ఈ రెండు కూడా ఓకే స్టోరీ లైన్ తో తెరకెక్కాయి. వీటి ఫలితం  కూడా  ఒకేలా వచ్చింది. గత ఏడాది  భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను రాబట్టుకుంది. అయితే  మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో  మొదటి రోజే 40కోట్ల వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది.  ఆతరువాత రోజునుండి థియేటర్లు ఖాళీ అయిపోయాయి అనుకోండి. 
 
ఇక  ఈఏడాది  అంతే భారీ అంచనాలతో  విడుదలైయింది సాహో. ఈ సినిమా కు కూడా మొదటిషో నుండే డిజాస్టర్ టాక్  వచ్చింది.  అజ్ఞాతవాసి లాగే ఈచిత్రం కూడా భారీ ఓపెనింగ్ ను రాబట్టుకుంది.  సాహో తెలుగు తోపాటు హిందీ , తమిళ , మళయాలం లో విడుదలకావడంతో  మొదటి రోజు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే  విపరీతమైన నెగిటివ్ టాక్ తో  కూడా  హిందీలో 150కోట్ల వసూళ్లను రాబట్టి  హిట్ అనిపించుకోగా  తెలుగు తోపాటు మిగితా భాషల్లో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది.  
 
ఇక ఈరెండు సినిమాలు కు వున్న మరో పోలికేంటంటే.. అజ్ఞాతవాసి  టీజర్ 24గంటల్లో 413k లైకులను  రాబట్టుకొని  టాలీవుడ్ లో అత్యధిక లైకులను రాబట్టిన  టీజర్ గా రికార్డు సృష్టించింది.  ఇక ఈఏడాది  సాహో ఆరికార్డును  బ్రేక్ చేసింది. సాహో తెలుగు వెర్షన్ టీజర్ 24గంటల్లో 455k లైకులను సాధించి ప్రస్తుతం నెంబర్ 1స్థానం లో వుంది. ఇటీవల విడుదలైన  సరిలేరు నీకెవ్వరు టీజర్ 24గంటల్లో  386k ,అల... వైకుంఠపురములో టీజర్  387k లైకులతో సరిపెట్టుకున్నాయి.  అయితే వచ్చే ఏడాది ఆర్.ఆర్.ఆర్ , సాహో రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: