జనరేషన్స్ మారినా టాలీవుడ్ నెంబర్ వన్ తానేనని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ వెండిత్రపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చాటింది. తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా తమిళనాట టీవీ ప్రీమియర్ లో రికార్డులు సృష్టించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీస్ లో టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించి నెంబర్ వన్ గా నిలిచింది.

 

 

నిజానికి సైరా తెలుగులో ఆడినంత గొప్పగా మిగిలిన భాషల్లో ఆడలేదు. తమిళంలో ఫ్లాప్ మూవీగా నిలిచింది. సైరా తమిళ వర్షన్ శాటిలైట్ రైట్స్‌ను సన్ టీవీ సొంతం చేసుకుంది. డిసెంబర్ 1న సన్ టీవీలో సైరా ప్రసారమైంది. అయితే.. అందరి అంచనాలను తిరగరాస్తూ ‘సైరా’.. బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీని రాబట్టింది. టోటల్ గా 15.44 టీఆర్పీని సొంతం చేసుకుని బాహుబలి2 తమిళ్ వెర్షన్ సాధించిన 10.33 రేటింగ్ ను వెనక్కునెట్టి నంబర్ వన్ గా నిలిచింది. తమిళంలో గత వారం అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన టాప్ 5 మూవీస్ లో ‘సైరా’ స్థానం సంపాదించింది. 

 

 

 సైరా కంటే ముందు తమిళ టీవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన ‘1 నేనొక్కడినే’ 13.06 టీఆర్పీ సాధించి టాప్ లో నిలిచింది. దీని తరవాత స్థానం కూడా మహేశ్ తన ‘స్పైడర్’ ద్వారా తమిళ్ ప్రీమియర్ లో 10.4 టీఆర్పీని సాధించాడు. నాలుగో స్థానంలో బాహుబలి2, ఐదో స్థానంలో  8.3 టీఆర్పీతో బాహుబలి: ది బిగినింగ్ ఉంది. మొత్తానికి తమిళ్ లో సినిమా అడకపోయినా తెలివిజన్లో మాత్రం సైరా తన సత్తా చాటింది. సినిమా ప్రమోషన్లలో చరణ్ ఫెయిలయ్యాడు అనే మాటకు ఈ టాప్ టీఆర్పీ రేటింగ్ ఉదాహరణగా నిలిచింది. లేకుంటే సినిమాగా కూడా సైరా హిట్ అయ్యేది.

మరింత సమాచారం తెలుసుకోండి: