సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా వెంకీ మామ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్కన రాశి ఖన్నా కథానాయకలాగా నటించారు. 

 

వెంకీ మామ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అయితే దర్శకుడు బాబీ ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా తీసినప్పటికీ, సెకండ్ హాఫ్ పై మాత్రం కేర్ తీసుకోలేదని అంటున్నారు. అయితే ఓవర్ ఆల్ గా సినిమా అంత చూస్తే బాగానే ఉందని, చాలా ఏళ్ళ తరువాత వెంకటేష్ ని మంచి రోల్ లో చూశామని కొందరు ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే సినిమా అంత యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్ని కలిసిన సినిమా. అయితే మొదట ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా బడ్జెట్ కూడా వెనక్కు రాదు అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అంత లేదు... వెంకీ మామ నిర్మాత చాలా తెలివైనవాడు.. అటు ఇటు ఏ సినిమాలు లేని రోజు సినిమాను విడుదల చేశాడు. అటు ఇటు అంటే.. చాల రోజుల నుంచి ఒక్క మల్టీస్టార్ చిత్రం కూడా విడుదల కాలేదు.. దీంతో సినీ ప్రియులు అంత మల్టీస్టార్ చిత్రాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కరెక్టుగా ఆ సమయంలోనే ఈ మల్టీస్టార్ చిత్రం విడుదల అయ్యింది. 

 

అంతేకాదు.. పక్కన కూడా ఏవి కొత్త సినిమాలు మంచి సినిమాలు లేవు.. చెప్పాలంటే నిన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రిలీజ్ అయ్యింది కానీ.. అది ఫుల్ మాస్ చిత్రం. ఆ సినిమా అంత రాజకీయాలే.. కుటుంబం అంత నవ్వుతు ఆనందంగా చూసే చిత్రాలు ఏవి లేవు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయినా ఈ వెంకీ మామ సినిమా సూపర్ డూపర్ గా డబ్బుని వసులు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: