సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలను కల్పిత పాత్రలతో తెరకెక్కించి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడం తో అభిమానులు , చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు కూడా కుమ్మేసాయని చిత్ర యూనిట్ చెపుతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సినిమా వందకి వెయ్యి శాతం బ్లాక్ బస్టర్ హిట్టు అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.

 

సినిమా మొదటి సగం ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు. మనకు తెలిసిన కథనే చూపించారు. కాకపోతే దానిని కల్పిత పాత్రలతో ఫుల్ ఎంటర్‌టైన‌ర్‌ గా చూపించి ఆకట్టుకున్నారు. ఇక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో దయనేని రమా హత్యతో కథ మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది..అసలు ఈ హత్య ఎవరు చేసారు అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.  సినిమాను వివాదాస్పదం గా కాకుండా కామెడీ గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. విడుదలైన అన్ని ఏరియాల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం.

 

నాకు తెలిసి వ‌ర్మ ఈ మ‌ధ్య కాలంలో ఇంత హిట్ అయిన దాఖ‌కాలాలు లేద‌నే చెప్పాలి. ఇక‌పోతే ఆయ‌న తెర‌కెక్కించిన పాత్ర‌ల‌న్నీ కూడా చాలా బాగా చేశారు. తనకు గిల్లడమంటే ఇష్టమని ఓ సందర్భంలో చెప్పుకున్నారు రామ్‌గోపాల్‌వర్మ. సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టింగ్స్‌ చూస్తే ఆయన ఎవరినీ గిల్లకుండా వదిలిపెట్టరని ఇట్టే అర్థమవుతుంది. సమకాలీన సినీ, రాజకీయ, సామాజిక పరిస్థితులపై తనదైన శైలిలో వ్యంగ్యం, హాస్యం మేళవించి ట్వీట్లు సంధిస్తుంటారు వర్మ. వివాదాలు ఆయన్ని చుట్టుముట్టడం కాదు..వివాదాల చుట్టే నిత్యం పరిభ్రమిస్తుంటారాయన. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్ర విడుదల సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ తలపెట్టిన ప్రెస్‌మీట్‌ను అడ్డుకుంది అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఆ టైమ్‌లోనే తాను ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ పేరుతో సినిమా తీయబోతున్నానని ప్రకటించారు వర్మ. టైటిల్‌ ప్రకటన నుంచే ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఏడాది వ్యవధిలో జరిగే సంఘటనల్ని వ్యంగ్యాత్మకంగా, కాల్పనిక అంశాల మేళవింపుతో ఈ చిత్రంలో ఆవిష్కరించానని చెప్పారు వర్మ. విడుదలకు ముందు సెన్సార్‌పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు కేంద్ర రివైజింగ్‌ కమిటీ అనుమతితో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: