సొంత మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య  నటించిన చిత్రం వెంకీ మామ.. కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి ఈరోజు థియేటర్లలో సందడి చేసింది..వెంకీ మామ పేరుకు తగ్గట్టుగానే సినిమాలో వీరి సందడి కూడా కాస్త జోరుగా సాగింది... ఇద్దరు టాప్ హీరోలు కావడం, సినిమాలను ఎలా ఆకట్టుకోవడం తెలిసిన వీరిద్దరి  కలిసి నటించడం వల్ల  ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. 


ఇకపోతే  సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా పై భారీ అంచనాలే ఉండటంతో సినిమా పాజిటివ్ అందుకుంటుంది. ముందు చూపించిన దానికంటే, ఇప్పుడు సినిమాలో అంతకు మించి కామెడీతో సాగిన సన్ని వేశాలు ఉండటం వల్ల ఈ సినిమా రేంజ్ మరో మెట్టు పెరిగిందని చెప్పాలి.. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. వెంకటేశ్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్ అయ్యింది.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది..ఈ సినిమాకు మెయిన్ హైలెట్  కామెడీ అని జనాలు అంటున్నారు.

ఏ వయస్సులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని అందుకే పెద్దలు అంటున్నారేమో.. కానీ విరుద్దంగా పాయల్ ప్రేమలో, వెంకీ  పడటడం. ఇక దానికోసం వెంకీ, చైతును అడిగి తెలుసుకోవడం వచ్చే కామెడీ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది.. దానితో సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..సినిమాలో గోదావరి మద్య సాగిన సన్నివేశాల్లో వెంకీ కామెడీ అద్యంతం కడుపుబ్బా నవ్వించారు. కామెడీ సినిమాలకు వెంకీ కేరాఫ్ అని చెప్పాడని ఈ సినిమా మరోసారి నిరూపించారు.  


కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జబర్దస్త్ ని కాపీ కొట్టిందని కొందరు అనగా, జబర్దస్త్ షో ని మరిచిపోయేలా చేసిన వెంకీ మామ అని మరికొందరు అంటున్నారు.  మొత్తానికి ఈ సినిమాతో చైతూతో పాటుగా అందరికి వెంకీ మామ అయ్యాడు.  సినిమా పాజిటివ్ టాక్ తూ పాటుగా ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ ను రాబడుతందనే వార్తలు ఇప్పుడు ప్రతి నోటా వినపడుతున్నాయి.. మొత్తానికి సక్సెస్ ఖాతాలో ఈ సినిమా పడిందన్నమాట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: