మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.  ‘పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే  అన్న విషయం కన్ఫర్మ్ చేస్తూ తమన్ ఇచ్చిన  హింట్ ఈ రోజు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై 40వ ప్రాజెక్టుగా ఒక  సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని దిల్ రాజుతో కలిసి తాను మూడోసారి ఈ సినిమా కోసం పనిచేస్తున్నానని తమన్ తెలపడమే కాకుండా ఒక పెద్ద హీరోతో తన బిగ్ జర్నీ అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అన్న హింట్ ఇచ్చాడు.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం తమన్ ఇప్పటికే ఓ రాకింగ్ ట్యూన్‌ ని కంపోజ్ చేశారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వరుస హిట్స్ పై దూసుకుపోతున్న థమన్ పవన్ కళ్యాణ్ సినిమాకు మొదటిసారి ట్యూన్స్ అందించబోతున్నాడు కాబట్టి థియేటర్స్ మోతమోగిపోవడం ఖాయం అంటూ పవన్ అభిమానులు జోష్ లో ఉన్నారు. 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘అల వైకుంఠపురములో' సినిమారేంజ్ కి మించి పవన్ సినిమాకు ట్యూన్స్ ఇవ్వాలని ఇప్పటి నుంచి తమన్ ఒత్తిడి పెంచుతూ పవన్ ఫాన్స్ ట్విట్స్  పెడుతున్నారు. దీనితో పవన్ మళ్ళీ మేకప్ వేసుకోవడం ఖాయం అని అనిపిస్తోంది.  

‘పింక్’ రీమేక్ గురించి ఇలా చాలామంది రకరకాలుగా లీకులు ఇస్తున్నా పవన్ మాత్రం ఈ సినిమా గురించి తన వ్యూహాత్మ మౌనాన్ని కొనసాగిస్తూ ఇప్పటికి తన అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు. దీనితో ఈ విషయమై పవన్ స్పందన గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: