వెంకటేష్, నాగచైతన్య లు కలిసి నటించిన చిత్రం వెంకీ మామ..  బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..వెంకీ మామ పేరుకు తగ్గట్టుగానే సినిమాలో వీరి సందడి కూడా కాస్త జోరుగా సాగింది... ఇద్దరు టాప్ హీరోలు కావడం, సినిమాలను ఎలా ఆకట్టుకోవడం తెలిసిన వీరిద్దరూ కలిసి నటించడం వల్ల  ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. 


సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ సినిమా  విడుదలయ్యాక మరింత రెట్టింపు అయ్యింది. ముందు చూపించిన దానికంటే, ఎక్కువగా అంతకు మించిన  కామెడీతో సాగిన సన్ని వేశాలు ఉండటం వల్ల ఈ సినిమా రేంజ్ మరో మెట్టు పెరిగిందని చెప్పాలి.. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. వెంకటేశ్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్ అయ్యింది.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది..ఈ సినిమాకు మెయిన్ హైలెట్  కామెడీ అని జనాలు అంటున్నారు.

 

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జబర్దస్త్ ని కాపీ కొట్టిందని కొందరు అనగా, జబర్దస్త్ షో ని మరిచిపోయేలా చేసిన వెంకీ మామ అని మరికొందరు అంటున్నారు.  మొత్తానికి ఈ సినిమాతో చైతూతో పాటుగా అందరికి వెంకీ మామ అయ్యాడు.  సినిమా పాజిటివ్ టాక్ తూ పాటుగా ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ ను రాబడుతందనే వార్తలు ఇప్పుడు ప్రతి నోటా వినపడుతున్నాయి.. మొత్తానికి సక్సెస్ ఖాతాలో ఈ సినిమా పడిందన్నమాట.. 

 

వెంకీ నటించిన సినిమాలు ఇప్పటివరకు చాలా హిట్ సినిమాలే ఉన్నాయి. తన కామెడీ టైమింగ్, రొమాన్స్, అమాయకమైన నటన ఈ సినిమాకు మంచి మార్కులు పడేలా చేశాయి.  దీనికి తోడు అల్లుడు నాగచైతన్య కామెడీ కూడా తోడవ్వడంతో ఈ సినిమా ఇవ్వాళ హిట్ టాక్ ను అందుకుంది.సినిమా హిట్ అవ్వడంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చైతు నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: