చిన్నవయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి జయం, దిల్ లాంటి వరుస హిట్లతో దూసుకు పోయిన నితిన్ ప్రస్తుతం భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మూడుపదుల వయసు ఉన్న నితిన్ పెళ్ళి చేసుకోబోతున్నాడనే వార్తలు హోరెత్తుతున్నాయి. నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో నితిన్ వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నది. అయితే నితిన్ కాబోయే భార్య మాత్రం సినీ పరిశ్రమకు చెందిన వారు కాదని తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే... ఈమె హైదరాబాద్ కు చెందిన బడా పారిశ్రామికవేత్త కూతురని సమాచారం. నితిన్, ఆమె ఇద్దరూ కలిసి 5 ఏళ్ల క్రితం నుంచి ఘాడమైన ప్రేమలో ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు కూడా వీరి వివాహానికి అంగీకరించినట్లు సమాచారం.


అతి తక్కువ సమయంలో ఆఫిషల్ గా నితిన్ తన వివాహ వార్తను సామజిక మాధ్యమాలలో ప్రకటించనున్నాడని సమాచారం. అదే విధంగా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, కెరీర్ ఏంటీ అనే విషయాలన్నీ తెలియనున్నవి. ఇప్పటివరకు.. నితిన్ కి హీరోయిన్లతో  అఫైర్ ఉన్నట్లు ఒక్కటంటే ఒక రెమర్క్ కూడా రాలేదు. దాంతో... శ్రీ రాముడి లాంటి నితిన్ ని వివాహమాడుతున్న ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


ఇక నితిన్ సినీ కెరీర్ విషయానికొస్తే... డియర్ కామ్రేడ్ ఫేమ్ రష్మిక మందన్న సరసన భీష్మ సినిమాలో నితిన్ బ్రహ్మచారి పాత్రను పోషిస్తున్నాడు. చలో సినిమా తీసిన వెంకీ కుడుముల భీష్మ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఈ సినిమాను మినహాయించి.. నితిన్ 'రంగ్ దే', 'చదరంగం' చిత్రాల్లో నటించనున్నాడు. మరొక సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని సమాచారం.


ఇకపోతే, నితిన్ కి వివాహం అయితే.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ గా మిగిలేది.. ప్రభాస్, రానా, రామ్ పోతినేని. వీరు తమ వివాహం గురించి ఒక్కసారి కూడా మాట్లాడిన దాఖలాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: