సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరికి వారు తమ అభిమాన హీరోల వీడియోలు టిక్‌టాక్‌ రూపంలో క్రియేట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ గా మారిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో లేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తో పాటుగా హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి విడుదలైన ఫోటోలలో మరియు అదే విధంగా టీజర్ లో ఎక్కడా కూడా హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రస్తావన రాకపోవడంతో చాలా మంది మహేష్ బాబు అభిమానులు మరియు అదే విధంగా ఇండస్ట్రీలో ఉన్న జనాలు సినిమాలో హీరోయిన్ రష్మిక కి అసలు క్యారెక్టర్ ఉందో లేదో అని సోషల్ మీడియా సాక్షిగా అనుమానాలు వ్యక్తం చేశారు.

 

దీంతో ఇది లేనిపోని పరిణామాలకు దారి తీస్తుంది అని సినిమా యూనిట్ అనుకున్నారేమో గాని ఇటీవల మహేష్ మరియు రష్మిక మందన కి సంబంధించిన ఫోటోలు సినిమా యూనిట్ విడుదల చేయడం జరిగింది. కాగా రాబోయే సంక్రాంతికి జనవరి 11 వ తారీకున ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వైవిధ్యభరితంగా అభిమానులను అలరించే విధంగా ప్రతి సోమవారం సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా యూనిట్.

 

ఇందులో భాగంగా వచ్చే సోమవారం 'HE'S Soo CUTE' అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేయనుంది. తాజాగా రష్మిక ఆ పాటతో మహేష్ బాబు పై టిక్‌టాక్‌ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇంకా మహేష్ అభిమానుల గురించి తెలిసిందేగా...వీడియో ని ఎప్పుడు పేర్లమీద షేర్లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవిధంగా నానా హడావిడి చేస్తున్నారు. ఈ సినిమాలో   ప్రకాష్‌రాజ్‌, సత్యదేవ్‌, నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత తో పాటుగా విజయశాంతి కూడా నటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: