సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ప్రతి రోజూ పండగే. కామెడీ సినిమా దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిమించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరు ఈ సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు దర్శకుడు మారుతి కి కూడా ఈ సినిమా సక్సస్ చాలా కీలకం. ఎందుకంటే ఆయన గత చిత్రాలు మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. 

 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి. తాజాగా సినిమాలోని ఓ యాక్షన్‌ సీన్‌కు సంబందించిన స్టిల్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు సినిమాను ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ చేసిన చిత్రయూనిట్ ఈ స్టిల్‌తో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్‌ను కూడా రివీల్ చేశారు. షర్ట్‌ లేకుండా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ బల్కీ బాడీతో సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు. అంతేకాదు వీపు మీద ఉన్న ఓం ట్యాటు ఫోకస్‌ అయ్యేలా డిజైన్‌ చేసి ఈ స్టిల్ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌కు కూడా ఫుల్ గా ఉంటాయని తెలియజేసేలా మెగా ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చారు. తన బల్కీ లుక్‌ ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌, ఆ ఫిజిక్‌ సాధించేందుకు తనకు సహకరించిన కోచ్‌, ట్రైనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. 

 

ప్రతి రోజు పండగే సినిమాలో సాయి తేజ్‌కు జోడిగా రాశీఖన్నా నటిస్తుండగా కీలక పాత్రలో సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడ్డ సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రలహరి సినిమాతో సక్సస్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి మళ్ళీ ఫుల్ ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ మెగా హీరో. దర్శకుడు మారుతి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపిందించిన ఈ సినిమాను తాతా-మనవడి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యం గా తెరకెక్కించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: