వెంకటేష్, నాగచైతన్యలు జంటగా నటించిన చిత్రం వెంకిమామ.. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు కథానాయికలుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఒక వైపు హిట్ టాక్ తో దూసుకుపోతున్న కూడా మరో వైపు కథ పాతదే కానీ కొత్తగా చూపించారు అనే టాక్ ను అందుకుంది. ఏది ఏమైనా ఈ సినిమా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఇకపోతే సినిమా కలెక్షన్స్ కూడా బరీగా వచ్చి పడుతున్నాయని టాక్. 


అయితే మొదటి నుండి వెంకీ మామ రిజల్ట్‌పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. వెంకటేష్, నాగచైతన్యలు స్క్రీన్‌ను షేర్ చేసుకోవడంతో పాటు.. లవకుశ లాంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌తో మంచి ఊపులో ఉన్న యువ దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో వెంకీమామ హిట్ ఖాయమే అనుకున్నారంతా. అయితే అందరి అంచనాలను నిజం చేస్తూ వెంకీ మామ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.


దర్శకుడు బాబీ ‘వెంకీ మామ’ చిత్రానికి వెంకటేష్, నాగచైతన్య లాంటి నిజమైన మామ అల్లుళ్లను తీసుకోవడంతోనే సక్సెస్ అందుకున్నాడనే  చెప్పాలి. తాను నమ్మిన కథకు అందులోని పాత్రలకు వందశాతం న్యాయం చేయగలిగే పాత్రల్ని ఎంచుకుని సేఫ్ జోన్‌లో నిలిచాడు దర్శకుడు బాబీ. నిజమైన మామా అల్లుళ్లు కావడంతో ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్‌ అవ్వడంతో పాటు.. విక్టరీ వెంకటేష్‌కి ఎమోషనల్ సీన్స్ బాగా పండటంతో సినిమా వన్ మ్యాన్ షో చేసేశాడు. నాగ చైతన్య కూడా తన నుండి పూర్తి సహకారం అందించడంతో ‘వెంకీ మామ’ బాగానే వర్కౌట్ అయ్యింది.

 

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వెంకీ మామ చిత్రానికి ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇదే ఊపు మరో వారం కొనసాగితే వెంకీ మామ లాభాల బాట పట్టడం పెద్ద కష్టం కాదు. ఇక తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లు గ్రాస్ సాధించినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కడుతున్నారు. మొత్తానికి అన్ని థియేటర్లలో కలిపి రెండు రోజులకు 40 కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: