తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రవి. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా యాంకర్ రవి  దర్శనమిస్తున్నారు. తన వాక్చాతుర్యంతో అందరిని మెస్మరైజ్ చేయడమే కాకుండా... తనదైన స్టైల్ యాంకరింగ్ తో యాంకర్లు  అందరిలో తనకంటూ ప్రత్యేకమైన ఫేమ్  సంపాదించుకున్నారు రవి. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్ లో యాంకర్ గా దూసుకు పోతున్నాడు రవి. ఒక బుల్లితెర పైనే కాకుండా సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసి తన సత్తా చాటుతున్నాడు. ఇక సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్  జరిగినా అక్కడ ప్రత్యక్షమైపోతున్నాడు యాంకర్ రవి. గత కొన్ని రోజుల వరకు పటాస్ ప్రోగ్రాం లో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన రవి... తాజాగా పటాస్ షో నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. 

 


 అయితే రవి పటాస్ షో నుంచి తప్పుకోవడానికి కారణం శ్రీముఖి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు రాగ వాటి పై స్పందించిన యాంకర్ రవి... పటాస్ నుండి  తప్పుకుంది కేవలం కొత్తదనం కోసమే అంటూ చెప్పుకొచ్చాడు రవి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన రవి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇన్ని రోజులు తన యాంకరింగ్ చేసి చాలామంది కోట్లు సంపాదించానని అనుకుంటారని...  తాను వెనకేసుకున్నది  అంతలా  ఏమీ లేదంటూ చెప్పారు రవి .ఏదో  కొంత మొత్తంలోనే వెనుకేసుకున్నానని  కానీ కోట్లకు కోట్లు మాత్రం తన దగ్గర లేవని చెప్పేసాడు. అంతేకాకుండా తాను ఎంతగానో నమ్మిన తన ఫ్రెండ్ తనను నమ్మించి మోసం చేసాడు అంటు ఈ సందర్భంగా రవి  చెప్పుకొచ్చాడు. 

 


 రెండేళ్ల పాటు తన స్నేహితుడు కలిసి ఉన్నానని... ప్రతి రోజు గుడికి వెళ్లే వాడని...  మంచి  వాడిలా  నటించి తను నమ్మించాడని... మందు తాగే అలవాటు కూడా తన ఫ్రెండ్ కు లేదు అంటూ చెప్పాడు రవి . అయితే వ్యాపారంలో తీవ్ర నష్టాల పాలయ్యాను  అని కుటుంబం నడిరోడ్డున పడుతుందని తన స్నేహితులకు తనకు చెప్పి సాయం చేయమని కోరగా... 45 లక్షలు ఇచ్చానని.. అయితే తాను ఇచ్చిన డబ్బులను 20 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని తన స్నేహితుడు చెప్పాడని రవి చెప్పుకొచ్చారు. అయితే 45 లక్షలు తీసుకొని ఇప్పటికే రెండు ఏళ్ళు అయిన ఇప్పటికి కూడా కనీసం ఆచూకీ కూడా లేదని యాంకర్ రవి తెలిపారు. దీనికోసం తన తండ్రితో పాటు లీగల్ పోరాటం చేస్తున్నట్లు రవి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: