బాహుబలి తర్వాత  ప్రభాస్ నటించిన చిత్రం సాహో.. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క రోజు కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేక పోయింది. కలెక్షన్లు మాత్రం రాబట్టిన కూడా సినిమా బాగాలేదని టాక్ ను అందుకుంది. అయితే సినిమా ఏదోలా ఉన్న కూడా సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కు మాత్రం మంచి పేరు దక్కింది. తెలుగులో చేసిన మొదటి సినిమాలోనే తన అందాలతో కట్టిపడేసింది. 

 

శ్ర‌ద్దా క‌పూర్ న‌టిస్తున్న తాజా చిత్రం `స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ`. ఎబీసీడీ, ఎబీసీడీ 2 చిత్రాల త‌రువాత క్రేజీ బాలీవుడ్ డ్యాన్స‌ర్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.వ‌రుణ్‌ధావ‌న్‌, ప్ర‌భుదేవా, నోరా ఫ‌తే, పునీత్ పాత‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా కీ రోల్ పోషిస్టోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్తయింది. ఈ చిత్రంలో శ్ర‌ద్ధా ఆల్ట్రా మోడ్ర‌న్ స్టైల్లో క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను శ్ర‌ద్ధా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. స్టైలిష్ లుక్‌లో కేక పుట్టిస్తున్న శ్ర‌ద్ధా లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `కీప్‌ద ఫైర్ బ‌ర్నింగ్ స‌మ‌రం మరో ఆరు అడుగుల దూరంలో వుంది. 


సాధారణ డ్యాన్సర్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ నెల 18న బ‌య‌టికి రాబోతోంది` అని ట్విట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మొదటి నుండి ఫామ్ లో ఉన్న శ్రద్దా ప్రపంచ స్థాయి హీరో ప్రభాస్ సరసన నటించడం తో ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్న శ్రద్ద మరో రెండు సినిమాలకు సైన్ చేసిందనే టాక్ వినపడుతుంది. 

 

 ఇకపోతే .. హీరో వ‌రుణ్‌ ధావ‌న్ కూడా త‌న ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని షేర్ చేశాడు. భూమ్‌, ఎస్‌డి3, స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3 పేరుతో హాష్ ట్యాగ్‌లు పెట్టాడు. ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది. నిద్ర‌లేని రాత్రుల‌కు తెర‌ప‌డ‌బోతోంది` అని ట్విట్ట‌ర్ వేదిక‌గా రాసుకొచ్చాడు. ఈ చిత్రాన్ని అమృత్‌స‌ర్, లండ‌న్‌, ముంబై, దుబాయ్‌లో చిత్రీక‌రించారు. టీ సిరీస్ సంస్థపై భూష‌ణ్‌కుమార్, క్రిష‌న్ కుమార్, లీజ‌లే డిసౌజా నిర్మిస్తున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 24న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్‌కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుండి విడుదలైన ఈ పోస్టర్ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుందని కామెంట్లను అందుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: