నిజానికి బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో ఒక అడుగు ఎప్పుడు  ముందంజంలో ఉంటారు. వారు కేవలం సినిమాలు మాత్రమే తీయడం  కాదు ఆ సినిమా రికార్డులు తిరగరాసే విధంగా ఉంటాయి . ఈ క్రమంలో ఇటీవల హిందీలో తాజాగా మరో యదార్థ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల గురించి జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన సంఘటన  లక్ష్యంగా పెట్టుకొని  ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. భారత వైమానిక దళాలు దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై  మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే.

 

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సంఘటననే కథాంశంగా తీసుకొని ఓ సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. భూషణ్‌ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ట్విటర్‌ ద్వారా ఆయన  వెల్లడించారు. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు ‘కేదార్‌నాథ్‌’ దర్శకుడు అభిషేక్‌ కపూర్‌  చేపట్టనున్నాడని తెలిపారు. భూషణ్‌ కుమార్‌ ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు గొప్ప ప్రతీకగా ఇప్పుడు తీయబోతున్న ఈ సినిమా నిర్మితమవుతుందన్నారు.

 

 ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత్‌ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబులు వర్షం కురిపించి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే  భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ ఆ సమయంలో పాకిస్తాన్‌ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు.

 

భారత ప్రభుత్వం  ఆయన ధైర్యసాహసాలను మెచ్చిన అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ నటుడు, నిర్మాత వివేక్‌ ఒబెరాయ్‌‘బాలాకోట్‌- ది ట్రూ స్టోరీ’ సినిమా తీస్తానని  గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఒకే ఘటనపై రెండు రకాల సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: