తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...రెండో ద‌ఫా అధికారం చేప‌ట్టి ఏడాది పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి వివిధ ర‌కాల వ‌ర్గాలు ఆయా రీతిలో స్పందిస్తున్నాయి, విశ్లేషిస్తున్నాయి. అయితే, తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ స్పంద‌న స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తించేదే! ఆ పార్టీ స్పంద‌న ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి ఉన్న త‌రుణంలో.... తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ ప‌ర్సన్ విజయశాంతి స్పందించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌టి సంవ‌త్స‌రం పాల‌న‌పై విజ‌య‌శాంతి ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

 

సొంత ఇళ్లు కూల్చి..షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం...బాల‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యానికి కార‌ణం ఆయ‌నేనా? 

 

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది  పూర్తవుతున్న సందర్భంగా కేసీఆర్‌ పాలన గురించి చెప్పాలంటే అంటూ విజ‌య‌శాంతి ఆస‌క్తిక‌రంగా విశ్లేషించారు. ``ఏడాది పాల‌న‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని... ముఖ్యమంత్రి దొరగారు, ఆయన కుటుంబం అంతకన్నా ఎక్కువ  కలిమితో  ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి... ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది.`` అంటూ ఎద్దేవా చేశారు.  

 

65 ఏళ్ల‌ ముస‌లోడికి పోరీల పిచ్చి..73 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఏం చేశాడో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్న కేసీఆర్ సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఏ మేరకు తగ్గించారో వివరించాల్సిన అవసరం ఉందని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. `` ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని వాటి ద్వారా కేసీఆర్ గారు తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని  కలలు కంటున్నారు. ప్రభుత్వ ఖజానాను ముంచేసి, ఇంతకాలం మాయమాటలు చెప్పిన సీఎం దొరగారు... ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలను ఒప్పుకోక తప్పలేదు. అదేవిధంగా ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడి... ఆయన అసలు స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారు.`` అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సైతం తట్టుకోలేకపోతున్నాయని  హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోందని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: