ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో ఒకప్పుడు బాయ్స్ మూవీలో కనిపించిన థమన్ తర్వాత సంగీత దర్శకుడిగా మారారు.  దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు.  ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ (ఎస్ ఎస్ థమన్) ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళంలో ఈ యువ సంగీత దర్శకుడు సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తున్నాడు. రొటీన్ పంథా వదిలి ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అప్పటి నుండి నిర్మాతల చూపు ఆయన మీదే పడింది. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం నుండి ‘సామజవరగమన’ పాట బయటికొచ్చిందో అప్పటి నుండి నిర్మాతలు థమన్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. కొత్తదనం కావాలంటే థమన్ దగ్గరికి వెళ్లాల్సిందే అంటున్నారు.  

 

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయబాట పట్టిన ఆయన.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారని తెలుస్తోంది.  పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కేవలం 20రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా వుండే కథను ను ఎంచుకున్నారు. ఎట్టకేలకు పవన్ రీ ఎంట్రీ పై క్లారిటీ దొరికింది. ఆయన పింక్ మూవీ రీమేక్ చేయనున్నట్లు స్పష్టమైన ప్రకటన వచ్చేసినట్లే. బోనికపూర్ దిల్ రాజు నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో పింక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు  దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ నేడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని కలవడంతో పాటు పింక్ రీమేక్ కొరకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాము అని అధికారికంగా ప్రకటించారు.

 

ఈ మేరకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన ట్వీట్ చూసి ఇదే పవన్ రీ ఎంట్రీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అని ఫిక్సయ్యారంతా. ఇంతకీ తమన్ ట్వీట్ ఏంటి? అందులో ఏముంది?  పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే అని కన్ఫర్మ్ చేస్తూ ఓ హింట్ ఇచ్చారు థమన్.  ఇలా ఒక్కసారే పవన్ సినిమా రావడంతో థమన్ రేంజ్ ఒక్కసారే పెరిగిపోయింది. అంతా ప్రస్తుతం థమన్ మ్యానియానే నడుస్తుందని అనుకుంటున్నారు. పైగా థమన్ కూడా చేతిలో ఉన్న ప్రతి సినిమాకు భిన్నమైన సంగీతం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: