మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం ప్ర‌తి రోజూ పండ‌గే. మారుతి ఈ చిత్రానికి ద‌ర్వ‌క‌త్వం వ‌హించ‌గా ఈ చిత్రాన్ని అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోష్స్ కూడా జరగుతున్నాయి. తాజాగా సినిమాలోని ఓ యాక్షన్‌ సీన్‌కు సంబందించిన స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పటి వరకు సినిమాను ఓ ఫ్యామిలీ ఎమోషనల్  బాండింగ్ ఉన్న మూవీగా అనుకుంటున్న ప్రేక్ష‌కుల‌కు చిత్రయూనిట్ ఈ స్టిల్‌తో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్‌ను రివీల్ చేశారు.

 

షర్ట్‌ లేకుండా ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ బల్కీ బాడీతో సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు. అంతేకాదు వీపు మీద ఉన్న ఓం ట్యాటు ఫోకస్‌ అయ్యేలా డిజైన్‌ చేసి ఈ స్టిల్ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌కు కూడా పుష్కలంగా ఉంటాయని తెలియజేసేలా ఉంది.

 

తన బల్కీ లుక్‌ ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌, ఆ ఫిజిక్‌ సాధించేందుకు తనకు సహకరించిన కోచ్‌, ట్రైనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతి రోజు పండగే సినిమాలో సాయి తేజ్‌కు జోడిగా రాశీఖన్నా నటిస్తుండగా కీలక పాత్రలో సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కనిపించనున్నాడు. అంతేకాక ఈ స్టిల్ విడుద‌ల చేసిన వెంట‌నే కొంత మంది నెటిజ‌న్లు దీన్ని బాహుబ‌లిలో ప్ర‌భాస్‌తో పోల్చుతున్నారు. అందులోనూ ఫొటో బ్యాక్‌డ్రాప్‌లో ఓ శివ‌లింగం ఫొటో కూడా క‌నిపించ‌డం అచ్చం అలానే ఉంద‌ని అంటున్నారు.

 


ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడ్డ సాయి చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించాడు. ఈ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ మెగా హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: