సినిమాల్లో నటించే హీరోయిన్స్ ధరించే బట్టలు, నగలు వంటి వాటికి ఎంతో డిమాండ్ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం తొలినాళ్ళలో అయితే దర్శకులు మరియు నిర్మాతలు ఫలానా రకమైన బట్టలు హీరోయిన్ల కోసం దగ్గరుండి తయారుచేయించేవారట. అయితే అది రాను రాను మారిపోతూ, నేటి కాలంలో హీరోయిన్లకి ఎవరికి వారికి ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైనర్లు ఉంటున్నారు. ఏదైనా సినిమా కోసం పని చేస్తున్నపుడు తమ పర్సనల్ డిజైనర్ల చేత ఆ సినిమాలోని తమ పాత్రకు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకోవడం అలవాటు అయిపొయింది. 

 

ఇక ప్రస్తుతం ఆ విధంగా చాలా మంది హీరోయిన్స్ కు ప్రత్యేకంగా కాస్టూమ్ డిజైనర్లు ఉన్నారు. ఇకపోతే ఈ విధమైన ట్రెండ్ ని పాటిస్తున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్లు ఒకింత ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రఖ్యాత కపూర్ ఫ్యామిలీ నుండి తన సోదరి కరిష్మా కపూర్ తరువాత బాలీవుడ్ సినిమా రంగంలో అడుగుపెట్టిన కరీనా, తొలి సినిమా నుండి తన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఫ్యాషన్ ట్రెండ్ ని అనుసరించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డ్రెస్సెస్ ని డిజైన్ చేయించుకునే కరీనా కపూర్

 

 

నిన్న తన పేరుతో ఏకంగా ఒక చీర డిజైన్ చేయించి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. నిన్న తన లేటెస్ట్ సినిమా గుడ్ న్యూజ్ ప్రమోషన్స్ లో భాగంగా జరుగ తలపెట్టిన ఒక టెలివిజన్ షో కోసం కరీనా, పింక్ కలర్ లో తన ఫ్యాషన్ డిజైనర్ తో డిజైన్ చేయించిన చీర పై తన ముద్దు పేరైన 'బెబో'ను ముద్రించుకుంది. ఇక ఆ డ్రెస్ ని పలువురు మీడియా మిత్రులు క్లిక్ చేయడం జరిగింది. కాగా ఆ డ్రెస్ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: