టాలీవుడ్, తెలుగు బుల్లితెర పై యాంకర్ సుమ తనదైన శైలిలో రాణిస్తోంది. సుమ మలయాళి అమ్మాయి అయినప్పటికి.. తెలుగులో మాత్రం చాలా చక్కగా మాట్లాడుతోంది. ఆమె యాంకరింగ్ చేస్తే ఎవరైన ఫిదా కావాల్సిందే. అన్ని భాషల్లో పట్టున్న సుమ ఇప్పటికి నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది.

 

ఈవెంట్స్, రియాలిటీ షోలు, గేమ్‌లు, ఇలా ఒకటేంటి.. ప్రతిదీ చేస్తోంది సుమ. ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ కూడా సుమకే ఓటేస్తారు. అయితే కొద్దిరోజులుగా సుమ చేస్తున్న రకరకాల డిమాండ్లతో నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని టాక్ వినిపిస్తోంది.

 

ప్రస్తుతం సుమ రెండు గంటల వ్యవధి ఉన్న ఒక్కో షోకు మూడు నుంచి ఐదు లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. దీనికి జీఎస్టీ అదనం. దాంతో టాలీవుడ్ నిర్మాతలకు తడిసి మోపెడవుతోందని సమాచారం. అందుకే సుమను పక్కన పెట్టి.. ఆమె కన్నా తక్కువకే హోస్టింగ్ చేసే మిగతా వారితో సరిపెట్టుకోవాలని చూస్తున్నారట. ఇక చిన్న సినిమాలకు కూడా ఇదే విధంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల ఆమెను పక్కను పెడుతున్నారట. ఇంత‌కీ సుమ ఎందుకిలా చేస్తుందో మ‌రి కొత్తనీరు వ‌స్తుంటే పాత నీరు పోతుంది. అయిన‌ప్ప‌టికీ ఈమెకి ఉండే టాలెంట్‌ను గుర్తించి మ‌న నిర్మాత‌లు ఛాన్స్ ఇస్తున్నా స‌రే దాన్ని స‌రిగా వినియోగించుకోకుండా అన‌వ‌స‌ర డిమండ్స్ పెడితే అస‌లుకే మోస‌మొస్తుంద‌ని గ్ర‌హించ‌లేకపోతుందా అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ఇదిలా ఉంటే దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని టైం ఉన్న‌ప్పుడే అన‌వ‌స‌ర డిమాండ్ల‌కి పోయి ఉన్న కాస్త అవ‌కాశాన్ని చెయి జార్చుకోకుండా ఉంటే బావుంటుంది. 

 

ఇక ఎంత అనుభ‌వం ఉన్నా. ఎన్ని షోలు చేసినా నిర్మాత‌లు చూసేది మాత్రం సీనియారిటీ మాత్ర‌మే కాదు. వాళ్ళు పెట్టే డిమాండ్లు కూడా వాళ్ళ‌కి అవ‌స‌ర‌మే అలాగే ఎంతో మంది యంగ్ జ‌న‌రేష‌న్ వ‌స్తున్న‌ప్పుడు కొంచం చూసి జాగ్ర‌త్త‌గా మ‌సులుకోవ‌డ‌మే మేలు.  యాంకర్ సుమ రెమ్యునరేషన్ ఎక్కువ అనుకుంటే.. దానికి జీఎస్టీ కూడా నిర్మాతలే కట్టాలంటే ఎలా అంటున్నారు మరికొందరు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా హోస్ట్ చేసిన ప్రతి సినిమాకు రెమ్యునరేషన్, జీఎస్టీ కూడా వసూలు చేస్తుండడంతో కొందరు నిర్మాతలు సుమను పక్కనపెట్టి యువ యాంకర్ల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: