చలన చిత్ర రంగ పరిశ్రమలో జరిగే కొన్ని ఘటనలు వింటుంటే అసలు అవి నిజమేనా అని మనలో కొందరికి అనిపించక మానదు. అయితే కొన్ని పరిస్థితులు మరియు సందర్భాలను బట్టి వాటిని నమ్మక తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, నిన్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోకు ఘోర అవమానం జరిగిన ఘటన పలు బాలీవుడ్ వర్గాల తో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, ఇటీవల బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కబీర్ సింగ్ లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ ని, ఒక ప్రముఖ అవార్డుల సంస్థ, బెస్ట్ యాక్టర్ అవార్డు మీకే ఇవ్వబోతున్నాం అని, 

 

అలానే మీతో ప్రత్యేకంగా ఒక డాన్స్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆహ్వానం పంపిందట. అయితే వారి ఆహ్వానం మేరకు ఫంక్షన్ కు హాజరైన షాహిద్ కు కాకుండా చివరి నిమిషంలో బెస్ట్ యాక్టర్ అవార్డు మరొక యువ హీరో వరుణ్ ధావన్ కు ఇవ్వడం జరిగిందట. ఆ ఘటనతో ఎంతో ఆవేదన చెందిన షాహిద్, తనతో ఏర్పాటు చేసిన డాన్స్ షో చేయడానికి నిరాకరించాడట. అయితే అదే సమయంలో ఆడియన్స్ నుండి వ్యతిరేకత ఎదురు కాకుండా, బెస్ట్ యాక్టర్ విన్నరైన వరుణ్ తో ఆ డాన్స్ షో ఏర్పాటు చేసిందట సంస్థ. ఇక ఈ మొత్తం ఘటనతో ఎంతో కలత చెందిన షాహిద్, తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట. 

 

ఇండస్ట్రీలో ఎటువంటి వివాదలు లేకుండా ముందుకెళ్తున్న తన వంటి సీనియర్ హీరోను ఈ విధంగా అవార్డు ఇస్తాం అని చెప్పి ఘోరంగా అవమానించడం సరైనది కాదని, అతి త్వరలో వారి పై కఠిన చర్యలు కూడా తీసుకుంటానని షాహిద్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. అయితే అవార్డు ఫంక్షన్ సమయంలో మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, అలా సడన్ గా అవార్డును వేరొక హీరోకు ఇస్తున్నట్లు ప్రకటించడం కరెక్ట్ కాదని కొందరు బాలీవుడ్ ప్రముఖులు సైతం షాహిద్ కు మద్దతు పలుకుతున్నారట. మరి ఈ ఘటన విషయమై మున్ముందు ఏమి జరుగ్తుందో చూడాలి.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: