అక్కినేని అభిమానులు మరియు  దగ్గుబాటి  అభిమానులు ఏ రోజుకోసమైతే ఎదురుచూసారో ఆ రోజు రానే వచ్చింది.    విక్టరీ వెంకటేశ్ , యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ. నిజ జీవితంలో మామ -అల్లుళ్లు  అయిన వెంకీ, చైతన్య  ఈచిత్రం లో  కూడా అవే పాత్రల్లో కనిపించనుండడంతో   మొదటి నుండి సినిమా  పై  మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఇక ఈ రోజు  విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ దగ్గర నుండి  మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ బాగుండడం తో ఈ చిత్రం  మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్ ను  రాబట్టుకోనుందని  ట్రేడ్ వర్గాలు  అంచనా వేస్తున్నాయి. మ్యాట్నీ షోస్ నుండే హౌస్ ఫుల్  బోర్డులు  పడడం తో  మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  8-9 కోట్ల షేర్ ను రాబట్టుకునే అవకాశం వుంది.  దాంతో ఈ చిత్రం అటు వెంకటేశ్ అలాగే నాగ చైతన్య కెరీర్ లో  బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా  గా  రికార్డు సృష్టించనుంది.  పూర్తి కమర్షియల్ ప్యాకేజీ  తో  బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో  స్టోరీ అంత గొప్పగా లేకపోయిన  వెంకీ -చైతన్య ల కెమిస్ట్రీ  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 
 
 
ఇక ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా  32కోట్ల  ప్రీ రిలీజ్ చేయగా మొదటిరోజే అందులో  1/4 వంతు  వసూళ్లను రాబట్టుకుందని సమాచారం. సోలో  విడుదల  కావడం తో వచ్చే  శుక్రవారం వరకు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పోటీలేకపోవడం కూడా కలిసి రానుంది.  తమన్ సంగీతం అందించిన  ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించగా నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటించింది.  సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: