అబ్‌రామ్‌ ఖాన్‌, తైమూర్‌ అలీఖాన్, ఆరాధ్య బచ్చన్‌ వీరంతా ప్రస్తుతం వున్న బీ టౌన్‌ స్టార్‌ కిడ్స్‌‌  వీరికి  ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ఫొటోలు షేర్‌ చేస్తే లైకులు లక్షల్లో వచ్చిపడతాయి . అందుకే  ఫొటోగ్రాఫర్లు ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా తమ కెమెరా కన్నును క్లిక్‌మనిపిస్తారు. 

 

ఇక  బుల్లి స్టార్స్‌ పేరెంట్స్‌తో కలిసి కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే  అబ్‌రామ్‌ ఖాన్‌(6) బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌- గౌరీఖాన్‌ల ముద్దుల తనయుడు  ఈ తతంగమంతా చాలా విసుగు తెప్పించింది. అబ్‌రామ్‌ తమ కారు వెళ్లకుండా అడ్డుకుంటూ.. తనపై ఫ్లాష్‌ల వర్షం కురిపిస్తున్న ఫొటోగ్రాఫర్లపై  అసహనం వ్యక్తం చేశాడు. ఐతే కారుకు అడ్డుతప్పుకోవాలని చేతులతో సైగలు చేస్తూ.. తన ముఖాన్ని దాచుకున్నాడు.

 

ఇక ఫ్యాన్స్‌ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో ఇందుకు సంబంధించిన వీడియోను  షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది బాగా వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. అంతేకాదు నెటిజన్లు ‘చిన్నారిని తన బాల్యం ఎంజాయ్‌ చేయనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు’ అంటూ  కామెంట్లు మీద కామెంట్లు  చేస్తున్నారు. కాగా ఆదిరా బాలీవుడ్‌ బడా నిర్మాత ఆదిత్య చోప్రా- నటి రాణీ ముఖర్జీల గారాలపట్టి  పుట్టినరోజు సందర్భంగా.. పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అబ్‌రాం ఇలా  ఫొటోగ్రాఫర్లపై అసహానికి లోనయ్యాడు. 

 

ఇక ఈ పార్టీలో అబ్‌రాంతో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు కూడా సందడి చేశారు. ఇక అబ్‌రాం ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా  ముంబై ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు చిక్కకుండా తన మొహానికి బొమ్మను అడ్డుపెట్టుకున్నాడు. అదే విధంగా తన ఫొటోలు తీయొద్దంటూ కెమెరామెన్లను మరో ఈవెంట్లో సైతం హెచ్చరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: