‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయడమే ధ్యేయంగా సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో చిరంజీవి నటించిన ‘సైరా’ ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్పించి మరెక్కడా కనీస విజయాన్ని కూడ అందుకోలేక పోయింది. దీనితో చిరంజీవి షాక్ కు గురైనా ఆ షాక్ ను బయటపడనీయకుండా ‘సైరా’ తో తన కల నెరవేరింది అంటూ ఓపెన్ గా అనేకసార్లు మీడియా సాక్షిగా చెపుతూ తన ఫెయిల్యూర్ లో సక్సస్ ను చూసుకున్నాడు.

అయితే ఇప్పుడు ఆ విషయం చిరంజీవికి నిజంగానే వాస్తవ రూపం దాల్చి ఏకంగా తన ‘సైరా’ తో ‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ అయ్యాయి అన్న విషయం తెలియడంతో చిరంజీవి మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ అంతా మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సైరా’ తమిళంలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

వాస్తవానికి తమిళ ప్రేక్షకులకు చిరంజీవి సుపరచితుడు. గతంలో అతడి సినిమాలను తమిళ ప్రేక్షకులు బాగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ధైర్యంతోనే ‘సైరా’ ను తమిళంలో విడుదల చేయడమే కాకుండా ఆ సినిమాకు తమిళనాడు మీడియాలో కూడ భారీ పబ్లిసిటీ చేసారు. 

ఈ సినిమాకు ఏర్పడిన ప్రీ రిలీజ్ మ్యానియాతో ఈ మూవీ తమిళ వర్షన్ శాటిలైట్ రైట్స్ ను సన్ టివి భారీ మొత్తానికి ఈ మూవీ రిలీజ్ కు ముందే కొనుక్కుంది. ఈ సినిమా ఫెయిల్ అయిన తరువాత డిసెంబర్ 1న తొలిసారి సన్ టివిలో ప్రసారం చేసారు. అయితే అనూహ్యంగా ‘సైరా’ తమిళ వర్షన్ ప్రీమియర్ కు 15.44 టీఆర్పీ రావడం కోలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీ రికార్డుగా మారింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన ‘బాహుబలి 2’ తమిళ వర్షన్ టెలివిజన్ ప్రీమియర్ షోకు 10.33 టీఆర్పీ రేటింగ్ వస్తే ఇప్పుడు ఆ రేటింగ్ బ్రేక్ చేసి ‘సైరా’ కు 15.44 టీఆర్పీ రేటింగ్ రావడంతో కనీసం టెలివిజన్ టిఆర్పీ రేటింగ్ విషయంలో అయినా ‘సైరా’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసినందుకు మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: