ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు ఆతరువాత పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో అనుకోకుండా ‘లెజెండ్’ మూవీతో విలన్ గా మారి చాల తక్కువ సమయంలో టాప్ విలన్ స్టేటస్ కు ఎదిగిపోయాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడం మళయాళ భాషలలో కూడ జగపతి బాబు విలనిజమ్ హవా కొనసాగడంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే విలన్ గా మారిపోయాడు.

అలాంటి జగపతి బాబుకు ఇప్పుడు ఏమైంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏభారీ సినిమాలోను జగపతిబాబు కనిపించక పోవడంతో ఈసందేహాలు వస్తున్నాయి.  గత ఏడాది వచ్చిన 'రంగస్థలం' లో విలన్ పాత్ర కూడ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చినా చాలామంది టాప్ హీరోల సినిమాలలో జగపతి బాబుకు ఎందుకు పాత్రలు ఇవ్వడం లేదు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

‘సరిలేరు నీకెవ్వరు' లో ఒక ముఖ్య పాత్రకు మొదట జగపతిబాబును తీసుకున్నప్పటికీ ఆతర్వాత ఆపాత్ర ప్రకాష్ రాజ్ కు దక్కింది. ‘సైరా’ లాంటి ఒకటి రెండు సినిమాల్లో జగపతిబాబు కనిపించినా ఆతరువాత అతడు ఎక్కడా కనిపించలేదు. జగపతిబాబు ఇలా ఒకేసారి అవకాశాలు తగ్గిపోవడానికి గలకారణం కొత్త జనరేషన్ ఫిలింమేకర్లు జగ్గు భాయ్ పేరును పరిశీలించడం లేదని టాక్. 

అంతేకాదు చాలామంది దర్శకులు బాలీవుడ్ నటులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. జగపతి బాబుకు క్రేజ్ రీత్యా పెరిగిన భారీ పారితోషికం కూడ ఇలా అవకాశాలు తగ్గేలా చేసింది అని అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్ళీ జగ్గుభాయ్ కెరీర్ మళ్ళీ స్లో అయిపోతుందనీ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జగపతి బాబు తన పారితోషికం విషయంలో పట్టు విడుపు ప్రదర్శించకపోతే అతడి విలన్ పాత్రల కెరియర్ కూడ రిటైర్ మెంట్ కు దగ్గరలోకి వచ్చేస్తుందని అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: