జబర్దస్త్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.. కమెడియన్ వేణు టీంలో నుండి టీంలీడర్ గా ఎదిగిన సుధీర్.. తనదైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించాడు.  సుడిగాలి సుధీర్ తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌లోనే కాకుండా ఢీ, పోవే పోరా లాంటి షోలో చేస్తూ బిజీబిజీ అయిపోయాడు. ఇక మ‌రోవైపు `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా ద్వారా హీరోగా సైతం వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు సుధీర్‌. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మంచి వినోదాత్మక చిత్రంగా తెరక్కుతోంది. సుధీర్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.

 

ఇక సుధీర్ కు జోడిగా ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నటించింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సుధీర్‌ ఓ ఇంటర్వ్యూలో ఇటు నాగ‌బాబు.. ఇటు జ‌బ‌ర్ద‌స్త్‌పై కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ మ‌ధ్య కాలంలో జ‌బ‌ర్ద‌స్త్‌పై, టీ లీడ‌ర్స్ విష‌యంలో కొన్ని వార్త‌లు తెర వైర‌ల్ విష‌యం తెలిసింది. అయితే దీనిపై సుధీర్ మాట్లాడుతూ.. నాగబాబు తన వ్యక్తిగత కారణాలతో ఈ షో నుంచి బయటికి వెళ్లుండొచ్చు కానీ తమను వదిలేసి మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు. మ‌రియు ఆయన వెళ్లిపోవడం పూర్తిగా ఆయన పర్సనల్ కానీ దాన్ని తమతో కానీ.. షోతో కానీ కనెక్ట్ చేయొద్దంటున్నాడు. అలాగే జబర్దస్త్ ఉన్నంత వరకు తాను ఆ షోను వదిలే సమస్యే లేదంటున్నాడు సుధీర్. 

 

షోలో ఎవరున్నా లేకపోయినా.. ఎవరు వెళ్లిపోయినా కూడా తాను మాత్రం జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలనని క్లారిటీ ఇచ్చాడు. నాగ‌బాబుగారు మాకు గురువుతో స‌మాన‌మ‌ని.. అలా అని ఆయన వెళ్లినంత మాత్రానా తాము కూడా వెళ్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నాడు సుధీర్. ఇక సినిమాలు చేసినా.. స్టార్ డమ్ వచ్చినా జబర్దస్త్ మాత్రం వదలనని  సుధీర్ చెప్పుకొచ్చాడు. ఇక నాగ‌బాబు వెర్ష‌న్ ఏంటంటే.. సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లను అగ్రిమెంట్ పేరుతో జ‌బ‌ర్ద‌స్త్‌లోనే లాక్ చేసారని చెప్పాడు. కానీ ఇప్పుడు సుధీర్ మాత్రం నాగ‌బాబుకు షాకిస్తూ జబర్దస్త్ నా ప్రాణం.. నాగబాబు వెళ్లినా తాము జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌ద‌ల‌మ‌ని క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: