నాగచైతన్య ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలపై స్పందించకుండా నాగార్జున ఎప్పుడులేడు.  తన సొంత బ్యానర్లలో నాగచైతన్య నటించినా బయట బ్యానర్లలో నటించినా తండ్రిగా తన కర్తవ్యం నిర్వహిస్తూ నాగార్జున ఆ సినిమాలకు తనవంతు ప్రమోషన్ చేస్తూ వచ్చాడు. వాస్తవానికి నాగచైతన్య సినిమాలకు సంబంధించి మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీ హీరోల ఏసినిమాలు విడుదల అయినా ఆ సినిమాలపై నాగార్జున స్పందిస్తూనే వచ్చాడు. 


ఆఖరికి సమంత అక్కినేని కుటుంబ కోడలుగా మారాక ఆమె సినిమాల పై కూడ నాగార్జున ఆ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది చైతన్య తొలిసారిగా తన మేనమామ వెంకటేష్‌ తో కలిసి చేసిన చిత్రం గురించి  ఆ సినిమా విడుదల అయ్యాక కూడ ఇప్పటివరకు ఒక్క మాట కూడ నాగార్జున మాట్లాడకపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

అనేకమంది ఇతర హీరోల సినిమాల గురించి ట్విట్స్ పెట్టె నాగార్జున ‘వెంకీ మామ’ గురించి తన మౌనాన్ని కొనసాగిస్తున్న పరిస్థుతులలో నాగ్ మౌనం పై మీడియా వర్గాలలో కామెంట్స్ వస్తున్నా పట్టించుకోక పోవడం హాట్ న్యూస్ గా మారింది. వాస్తవానికి వెంకటేష్‌ తో నాగార్జునకి రిలేషన్‌ అయితే బాగానే ఉంది అన్న వార్తలు ఉన్నాయి.  

సురేష్‌ బాబుతో కూడ నాగ్‌ కి ఎలాంటి సమస్యలు లేవు. అయినప్పటికీ 'వెంకీమామ' విషయంలో నాగ్‌ మౌనం ఎందుకు వహించాడు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.  ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు నిన్న మొదటిరోజు వచ్చిన వెంకటేష్ ఫ్యాన్స్ చైతన్యను పట్టించుకోక పోవడం చైతన్య ఫాన్స్ ‘వెంకీ మామ’ ను పట్టించుకోక పోవడం మరింత ఆశ్చర్యంగ మారింది. దీనికితోడు ‘వెంకీ మామ’  సినిమాను చూసిన సగటు ప్రేక్షకులు ఈ సినిమాను బిసి సెంటర్ల సినిమా గా తీర్పు ఇవ్వడంతో ‘వెంకీ మామ’ ఆశలు అన్ని గల్లంతు అయినట్లే అన్న కామెంట్స్ వస్తునాయి.. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: