గ్లామర్ బ్యూటీ  శ్రియ రష్యాకి చెందిన ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన తరువాత కూడ ఆమెకు సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి సీనియర్ హీరోలకు హీరోయిన్ గా ఈమెను పరిగణిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈమె  కోలీవుడ్ లో ‘సందైకారి’ అనే సినిమాలో నటిస్తోంది. పెళ్ళి  తర్వాత గ్యాప్ తీసుకుని శ్రియ నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఈమూవీలో సాప్ట్ వేర్ కంపెనీ బాస్ గా శ్రీయ నటిస్తోంది. 

ఇటీవల ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ లండన్ లో జరిగినప్పుడు శ్రియకు ఒక అనుకోని సంఘటన ఎదురైనట్లు టాక్. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లండన్ పోలీసుల టార్చర్ ఏవిదంగా ఉంటుందో శ్రియకు తెలిసి వచ్చేలా ఒక సంఘటన జరిగింది. లండన్  లోనే అతి పెద్ద విమానశ్రయం అయిన స్టాన్ ఫోర్డ్ ఎయిర్ పోర్టులో నటుడు విమల్ శ్రియపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తునప్పుడు ఈ సంఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  

ఆషూటింగ్ సమయంలో మధ్యవచ్చిన గ్యాప్ లో  శ్రియ భద్రతకు సంబంధించి సరిహద్దులను దాటి విమానాశ్రయంలోనికి అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా వెళ్లిందిట. దీనితో ఎయిర్ పోర్టు వద్ద గస్తీ కాస్తున్న పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా చుట్టుముట్టి శ్రియ తలకు తుపాకులు గురుపెట్టి ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. ఎవరు నువ్వు ? ఎందుకొచ్చావ్ ? లేడీ టెర్రరిస్ట్ వా ? అనుమతి లేకుండా ఎలా వస్తావ్ ? అంటూ ఆమెను చాలా ప్రశ్నలు వేసి ఇబ్బందికి గురి చేసినట్లు  టాక్.  

దీనితో జరుగుతున్న ఈపరిణామాలను గ్రహించిన నటుడు విమల్ లండన్ ఎయిర్ పోర్ట్ పోలీస్ అధికారుల వద్దకు వెళ్లి శ్రియ పాస్ పోర్ట్ తో సహా ఇంకా సంబంధిత ఆధారాలు చూపించి అక్కడ నుండి శ్రియను బయటకు తీసుకు వచ్చినట్లు టాక్. ఈఅనుకోని సంఘటన నుండి తేరుకోవడానికి శ్రియకు కొన్ని గంటలు పట్టిందిట. ఒక సందర్భంలో శ్రియను అలా పోలీస్ లు వరసపెట్టి ప్రశ్నలు వేయడంతో ఆమె ఆపోలీస్ లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు  ఇవ్వలేక బదులివ్వకుండా సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. ఆసమయంలో విమల్ శ్రియ విషయంలో సరిగ్గా స్పందించకపోతే శ్రియ చాల చిక్కులలో పడి ఉండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: