విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు. ‘ప్రేమమ్’ సినిమాలో కాసేపు మామా అల్లుళ్లుగా వెండితెరపై అలరించిన వీళ్లిద్దరు ఇపుడు పూర్తిస్థాయిలో ‘వెంకీమామ’గా పలరించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తే.. నాగ చైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వెంకీ మామ’ చిత్రానికి క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతోంది. 

 

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్ బాబు, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మించాడు. లవకుశ లాంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌తో మంచి ఊపులో ఉన్న యువ దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం  వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటించాడు. అయితే సినిమా పరంగా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ వలన ‘వెంకీ మామ’ మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. 

 

వెంకటేష్ మరియు నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇప్పటి వరకూ ఇద్దరి హీరోలకి సోలోగా మొదటి రోజు 5 కోట్ల షేర్ మార్క్ సాధించిన సినిమాలు కూడా లేవు. కానీ వెంకీ మామ మాత్రం.. ఏకంగా మొదటి రోజు సుమారు 7.16 కోట్ల షేర్ ని సాధించింది స‌త్తా చాటింది. మ‌రియు ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా నెంబర్ 1 ప్లేస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

 

‘వెంకీ మామ’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు:

 

నైజాం- 2.29 కోట్లు

 

సీడెడ్- 1.67 కోట్లు

 

గుంటూరు- 0.72 కోట్లు

 

ఉత్తరాంధ్ర- 0.88 కోట్లు

 

తూర్పు గోదావరి- 0.66 కోట్లు

 

పశ్చిమ గోదావరి- 0.35 కోట్లు

 

కృష్ణా- 0.37 కోట్లు

 

నెల్లూరు- 0.27 కోట్లు
-----------------------------------------
ఫస్ట్ డే మొత్తం షేర్- 7.16 కోట్లు
-----------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: