ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ తెలుగు ప్రేక్షకులందరికీ ఎంత అనుబంధం ఏర్పడిందో అందరికీ తెలిసిన విషయమే. జబర్దస్త్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు ఎంతో మంది. జబర్దస్త్ కమెడియన్స్ స్కిట్ లలో  వేసే పంచ్ ల ద్వారా పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. అయితే నవ్వు నాలుగు విధాల మంచిది కానీ ఇతరులను కించపరిచేలా కామెడీ చేస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో బూతు పురాణాలతో కామెడీ స్కిట్లు జరిగేవి.. ఏకంగా బీట్ సౌండ్ వచ్చే విధంగా... డబుల్ మీనింగ్ డైలాగులతో స్కిట్ లు  చేసేవారు జబర్దస్త్ కమెడియన్స్. దీంతో జబర్దస్త్ షో ద్వారా చాలామంది పిల్లలు చెడిపోతున్నారని.. జబర్దస్త్ షో ని వెంటనే ఆపివేయాలి అంటూ అప్పట్లో నిరసన కూడా వ్యక్తమయింది.

 

 

 

 అయితే జబర్దస్త్ జడ్జ్  నాగబాబు డబుల్ మీనింగ్ డైలాగ్ లకు.. బూతుల తో కూడిన స్కీట్లను ఇంటికి చెక్ పెట్టేసారు.  దీంతో క్లీన్ అండ్ నీట్  కామెడీతో జబర్దస్త్ స్కిట్లు అని దూసుకుపోయాయి . అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుంచి జడ్జిగా నాగబాబు తప్పుకోవడంతో మళ్లీ అలాంటి స్కిట్ లకే  తెరలేపుతున్నట్లు  అర్థమవుతుంది. ప్రతి సస్కిట్ లో  ఓ వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటం నీ మొహం అలా ఉంది నీ మొహం అద్దంలో చూస్కో ..  నల్లగా ఉన్నావ్ అది ఇది అంటూ అంటూ కించపరిచేలా మాట్లాడటం... ఇలాంటి పంచులు స్కిట్ లో ఎక్కువైపోతున్నాయి. ఇలా కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

 

 

 

 అయితే జబర్దస్త్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచేలా చేయడం లేదు అని నిర్వాహకులు చెబుతున్నారు.. అందరూ చూసే సామాజిక అంశాల్లో  వివక్ష చూపిస్తున్నారని పలువురు భావిస్తున్నారట. ప్రతివారం కొత్త కొత్త స్కిట్లు తో ప్రేక్షకులను నవ్వించడం కష్టమేనని.. కానీ కామెడీ కోసం ఇలాంటి వివక్షాపూరిత అంశాలను స్వీట్ లో భాగంగా చేసి షో కి మంచి పేరు తేవాలని అంటే ఎలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరు హర్ట్ అవ్వకుండా కామెడీ స్కిట్లు నవ్వులు పంచుతూ సాగి పోతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జబర్దస్త్ జడ్జ్  గా ఉన్న రోజా కూడా ఈ విషయంపై అటు కమెడియన్స్ కి సూచనలు ఇస్తే బాగుంటుందని జబర్దస్త్ ప్రేక్షకులకు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: