నందమూరి బాలయ్య బాబు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటించిన ‘రూల‌ర్’ సినిమా టీజర్ ఇటీవల విడుదలయ్యింది. సినిమా టీజర్ చూసిన నందమూరి అభిమానులు అంతగా సినిమాలో పెద్దగా ఆకట్టుకునే విధంగా ఈ విషయం లేదని సోషల్ మీడియాలో బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 'రూల‌ర్' సినిమా చేయకముందు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు నందమూరి బాలయ్య బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ ను 2 భాగాలుగా చిత్రీకరించి విడుదల చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి అప్పట్లో జరిగిన హడావిడి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఎలక్షన్ మూమెంట్ ఉండటంతో మరోపక్క బాలయ్య బాబు ఎన్టీఆర్ బయోపిక్ విడుదల చేయటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.

 

తీరా సినిమా విడుదలయ్యాక రెండు సినిమాలకు మొట్ట మొదటి షోకే ప్లాప్ టాక్ రావడంతో నిరుత్సాహపడ్డారు నందమూరి అభిమానులు. అయితే తర్వాత బాలయ్య బాబు మొదలుపెట్టినా 'రూల‌ర్' సినిమాపై అంచనాలు పెట్టుకొనగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బాలయ్యబాబు లుక్ లో మరియు అదే విధంగా టీజర్లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో గత సినిమాల్లో మాదిరిగానే 'రూల‌ర్' లో అదే డైలాగ్ డెలివరీ బాలయ్య బాబు చెప్పడంతో సినిమాకి మైనస్ చాలా కనపడుతున్నాయని సోషల్ మీడియాలో అభిమానులు నెటిజెన్లు అంటున్నారు.

 

మరోపక్క ఇంత నెగిటివ్ ‘రూల‌ర్’ సినిమాపై ఉన్న నేపథ్యంలో ‘రూల‌ర్’ సినిమాకి పోటీగా మరో అదే సమయంలో రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదలవడంతో సినిమాకి పెద్ద మైనస్ అని మరియు అదే విధంగా 'రూల‌ర్' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే జరిగినట్లు ఇందుమూలంగానే ఓవర్సీస్ రైట్స్ ఫ్రీగానే ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద సినిమా రిలీజ్ కాకముందే 'రూల‌ర్' సినిమా హిట్టా ఫ్లాపా అన్నది ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో ప్రస్తుత పరిణామాలు సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చెబుతున్నాయని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: