ఈ మధ్య కాలంలో  సినిమా హీరోలు సినిమాలలో హీరోలు గా నటించడం కంటే విలన్ గా నటించడమే బెటర్ అనుకున్న చాలా మంది ఇప్పుడు విలన్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మేరకు చాలా మంది సీనియర్ హీరోలు విలన్ గా సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పుడు గోపీచంద్ ఎక్కువగా కనిపించేవాడు. ఆ తర్వాత ఆది పినిశెట్టి ఈ మధ్య వచ్చే సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో రొమాంటిక్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. 


ఇలా ఒక్కొక్క హీరో విలన్ పాత్రల్లో నటిస్తే మంచి ఆదరణ పొందడమే కాదు జనాలు కూడా గుర్తు పెట్టుకుంటారని ఉద్ద్యేశంతో విలన్ పాత్రలను ఎంచుకుంటున్నారు. అదే మార్గాన్ని ఇప్పుడు సంక్రాంతి అల్లుడుగా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో శ్రీకాంత్ వలన పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ  విషయాన్నీ స్వాగ శ్రీకాంత్ వెల్లడించారు. 

 

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లోకనిపించబోతున్నాడట. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు.

 

అయితే, ఇప్పుడు  ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. గతంలో వచ్చిన వీరిద్దరి సినిమాలు హిట్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమా కూడా హిట్ అవుతుందనే  ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట . మరి ఈ సినిమా ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: