హీరో రాజశేఖర్ - జీవితాల ముద్దుల కూతురు శివాత్మిక ఇటీవల తెలుగుతెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. 'దొరసాని' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. నటనలో పరిణితి చూపిస్తూ.. ఏమాత్రం కొత్త లేకుండా ఆమె నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మంచి కథల కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఓ మంచి అవకాశం దక్కింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆమె నటనను గుర్తించి తన సినిమాలో అవకాశం ఇచ్చాడట. ప్రస్తుతం ఈ వార్త ఇండిస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

 

 

ప్రస్తుతం కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. 'నట సామ్రాట్' అనే మరాఠీ మూవీకి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శివాత్మిక బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు జోడీగా నటిస్తోంది. మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న శివాత్మిక కు కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ లభించడం ఆమె అదృష్టం అనే చెప్పాలి. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను దర్శకుడు కృష్ణవంశీ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా శివాత్మికాను ఎంపిక చేశారట. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవలే చిత్రీకరించినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

 

కృష్ణవంశీ ప్రాజెక్ట్ చేపడితే అందులో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు అధికంగా ఉంటాయి. అందులోనూ.. ఇప్పటి వరకూ కృష్ణవంశీ రీమేక్ సినిమా చేయలేదు. సొంతంగానే కథలు రాసుకునే కృష్ణవంశీ రీమేక్ కథ ఎంచుకున్నాడంటే కథా ప్రాముఖ్యం ఎక్కువని భావించాల్సిందే. మరి.. శివాత్మిక లోని నటనను ఈ సినిమా ద్వారా పూర్తిగా రాబట్టుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: